తమిళనాడుకు రాగి కవచాలు.. | Yadadri Temple Copper Shields To Tamilnadu For Gold Plating | Sakshi
Sakshi News home page

తమిళనాడుకు రాగి కవచాలు..

Jun 24 2019 3:27 AM | Updated on Jun 24 2019 3:27 AM

Yadadri Temple Copper Shields To Tamilnadu For Gold Plating - Sakshi

రాజగోపురంపై రానున్న సుదర్శన చక్రం

యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ అభివృద్ధి పనుల్లో భాగంగా సప్త రాజగోపురాలు, సుదర్శన రాజగోపురం, ధ్వజస్తంభం, బలి పీఠం అందంగా తయారు కానున్నాయి. తిరుమల తరహాలో వీటిని ఏర్పాటు చేయడానికి వైటీడీఏ అధికారులు సన్నాహాకాలు చేస్తున్నారు. ఇందుకోసం రాగి కవచాలను బంగారు తాపడం కోసం ఆదివారం తమిళనాడుకు తరలించారు. దాదాపు రూ.1.5 కోట్లతో బంగారు తాపడం పనులకు శ్రీకారం చుట్టారు. రెండు నెలల్లో బంగారు తాపడం పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. వీటితో పాటు గర్భాలయ ద్వారాలకు అమర్చేందుకు అందమైన చక్రాలు, చిత్రాలతో కూడిన రాగి వస్తువులను, చేతి పట్టుకు అవసరమైన పీడీలను, దశావతారాల విగ్రహాలను తయారు చేశారు. వీటన్నింటినీ బంగారు తాపడం కోసం తమిళనాడుకు తరలించారు. 


గర్భాలయం ద్వారంపై అమర్చే చక్రాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement