2 కోట్లతో యాదాద్రి మెట్లు

Yadadri stairs with 2 crores - Sakshi

యాదగిరికొండ: యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం పునర్నిర్మాణంలో భాగంగా సుమారు రూ.2 కోట్లతో మెట్లదారిని ఆధునీకరిస్తున్నారు. ఇందుకోసం పాతమెట్లను ఇప్పటికే తొలగించారు. స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు కొండపైకి వెళ్లే భక్తుల్లో 75 శాతం మంది మెట్ల దారి గుండా వెళ్తుంటారు. మిగతా వారు ప్రధాన ఘాట్‌ రోడ్‌ వెంబడి వాహనాల్లో వెళ్తుంటారు.  

మెట్ల దారిలో అన్ని సౌకర్యాలు... 
కొండపైకి వెళ్లడానికి గతంలో సుమారు 3,500 మెట్లు ఉండేవి. ఈసారి మెట్లకు మెట్లకు మధ్యమధ్యలో నడక దారిని ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా భక్తులు మధ్యలో కూర్చోవడానికి సిమెంట్‌ కుర్చీలు, తాగు నీటి కుళాయిలు, మెట్లకు ఇరువైపులా పట్టుకుని నడవడానికి పైపులను ఏర్పాటు చేస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణుల లాంటి వారు సేదదీరడానికి ప్రత్యేక గదులను నిర్మించనున్నారు. చిన్న చిన్న హోటళ్లు, దుకాణాలు లాంటివి ఏర్పాటు చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం సుమారు 2.కోట్ల వరకు కేటాయించారని సమాచారం. కృష్ణ శిలలతో నిర్మాణం చేస్తున్న మెట్ల దారిని మరో రెండు నెలల్లోపు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.  

ఐదు అంతస్తుల్లో కొండ కింది గోపురం...  
కొండ కింది రాజగోపురాన్ని సైతం 5 అంతస్తులుగా నిర్మాణం చేస్తున్నారు. ఈ వైకుంఠ రాజగోపురానికి మధ్యమధ్యలో శిల్పాలను అమర్చనున్నారు. ప్రస్తుత రాజగోపురానికి ఎలాంటి రంగులు, సున్నాలు లేకుండా సహజత్వం ఉట్టిపడేలా నిర్మాణం చేస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top