సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లాల్సిందే: దేవీప్రసాద్ | Work on the fact that: the controversy | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లాల్సిందే: దేవీప్రసాద్

Mar 27 2014 3:22 AM | Updated on Sep 2 2017 5:12 AM

రెండు రాష్ట్రాలు ఏర్పడిన వెంటనే అన్ని ప్రభుత్వ శాఖల్లోని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులు, అధికారులు తమ ప్రాంతానికి వెళ్లి పోవాల్సిందేనని టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్ వ్యాఖ్యానించారు.

హైదరాబాద్: రెండు రాష్ట్రాలు ఏర్పడిన వెంటనే అన్ని ప్రభుత్వ శాఖల్లోని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులు, అధికారులు తమ ప్రాంతానికి వెళ్లి పోవాల్సిందేనని టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్ వ్యాఖ్యానించారు. ఆ అధికారులు, ఉద్యోగులు వెళ్లకపోతే మరోసారి సకల జనుల సమ్మెను చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.

బుధవారమిక్కడి ప్రభుత్వ ఛాతీ వైద్యశాలలో జరిగిన టీఎన్జీవో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రెండు రాష్ట్రాలు ఏర్పడిన వెంటనే సీమాంధ్ర ఉద్యోగులు, అధికారులు తమ ప్రాంతానికి వెళ్లిపోవాలని సూచించారు. ఈ విషయంలో ఎలాంటి ఆప్షన్లు ఉండవని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఎన్జీవోల ప్రధాన కార్యదర్శి కె.రవీందర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు డి.రేచల్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement