కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్యాయత్నం | Woman attempts Suicide | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్యాయత్నం

Jul 27 2015 3:04 PM | Updated on Aug 29 2018 4:16 PM

కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపం చెందిన ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.

చివ్వెంల (నల్లగొండ) : కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపం చెందిన ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ఘటన నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం గాయంవారిగూడెంలో సోమవారం మధ్యాహ్నం జరిగింది.

వివరాల ప్రకారం... గాయంవారిగూడెం గ్రామానికి చెందిన రెమడాల లింగమ్మ(35) ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలు ఆర్పి, కాపాడేందుకు యత్నించిన మరో ముగ్గురు కుటుంబసభ్యులకు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement