సింగరేణిలో అత్యధిక ఇన్సెంటివ్‌లు వీరికే..

సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ ఇటీవల ప్రకటించిన 28 శాతం లాభాల వాటాలో శ్రీరాంపూర్ ఏరియాకు చెందిన టింబర్‌యార్డు వర్క్‌మెన్ మందాల ఓదేలు అత్యధికంగా రూ.1.80 లక్షల ఇన్సెంటివ్ సాధించాడు. ఏరియాల వారీగా అత్యధిక ఇన్సెంటివ్‌లు సాధించిన వారి వివరాలను యాజమాన్యం సోమవారం విడుదల చేసింది. ఓదేలు అత్యధిక ఇన్సెంటివ్ సాధించి మొదటి స్థానంలో నిలువగా, రూ.1.76 లక్షలతో మందమర్రి ఏరియాకు చెందిన జనరల్ మజ్దూర్ కుమ్మరి జెస్సీరాజ్ ద్వితీయ, రూ.1.67 లక్షలతో కొత్తగూడెం ఏరియా ఎల్‌హెచ్‌డీ ఆపరేటర్ రాంజీవన్ పాసి తృతీయ స్థానంలో నిలిచారు.
బెల్లంపల్లి ఏరియాకు చెందిన జూనియర్ అసిస్టెంట్ రూ.1.38 లక్షలు, కార్పొరేట్ ఏరియాకు చెందిన జూనియర్ అసిస్టెంట్ బొజ్జ రవీందర్ రూ.1.34 లక్షలు, ఇల్లెందు ఏరియాకు చెందిన జూనియర్ కెమిస్ట్ మనోజ్ కుమార్ రూ.1.51లక్షలు, భూపాలపల్లి ఏరియాకు చెందిన ఎల్‌హెచ్‌డీ ఆపరేటర్ చిలుకల రాయలింగు రూ.1.42 లక్షలు, రామగుండం–1 ఏరియాకు చెందిన ఫోర్‌మెన్ కె.ముత్తయ్య రూ.1.55 లక్షలు, రామగుండం–2 ఏరియాకు చెందిన ఓవర్‌మెన్ గోపు రమేష్‌కుమార్ రూ.1.58 లక్షలు, రామగుండం–3 ఏరియాకు చెందిన జనరల్ మజ్దూర్ నల్లని రాంబాబు రూ.1.52 లక్షలు, మణుగూరు ఏరియాకు చెందిన ఫిట్టర్ ముప్పారపు శ్రీనివాసరావు రూ.1.38 లక్షలు స్పెషల్ ఇన్సెంటివ్ సాధించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి