సంక్షేమ పథకాలు పేదలకు చేరాలి | Welfare schemes reach the poor | Sakshi
Sakshi News home page

సంక్షేమ పథకాలు పేదలకు చేరాలి

Apr 30 2015 9:46 PM | Updated on Sep 3 2017 1:10 AM

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు ప్రజలకు ఉపయోగ పడే విధంగా చూడాలని వాణిజ్యపన్నులు, సినీమాటోగ్రఫి శాఖమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పార్టీ నాయకులకు సూచించారు.

అమీర్‌పేట(హైదరాబాద్ సిటీ): తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు ప్రజలకు ఉపయోగ పడే విధంగా చూడాలని వాణిజ్యపన్నులు, సినీమాటోగ్రఫి శాఖమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పార్టీ నాయకులకు సూచించారు. అమీర్‌పేట డివిజన్‌లో నూతనంగా ఎన్నికైన టీఆర్‌ఎస్ అనుబంధ కమిటీల నాయకులు గురువారం మంత్రిని కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన పథకాలు పేదలకు అందిన పుడే నాయకులపై నమ్మకం కలుగుతుందని, అర్హులైన ప్రతి వ్యకి ్తకీ అవి అందేలా కృషిచేయాలని సూచించారు. ఎక్కడైన ప్రజలకు ఇబ్బందులు కలిగితే వెంటనే తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని తెలిపారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement