పేదలందరికీ సంక్షేమ పథకాలు | Welfare Schemes To Poor People | Sakshi
Sakshi News home page

పేదలందరికీ సంక్షేమ పథకాలు

Nov 19 2018 6:12 PM | Updated on Nov 19 2018 6:13 PM

Welfare Schemes To Poor People - Sakshi

మాట్లాడుతున్న జలగం ప్రసాదరావు, పక్కన పిడమర్తి రవి

సాక్షి,సత్తుపల్లిరూరల్‌:  కారు గుర్తుకు ఓటు వేస్తేనే అభివృద్ధి, సంక్షేమం అందుతుంది మాజీ మంత్రి జలగం ప్రసాదరావు అన్నారు. మండలంలోని రామానగరం, గంగారం, పాకలగూడెం, బేతుపల్లి గ్రామాలలో ఆదివారం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పిడమర్తి రవి, డీసీసీబీ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు, మట్టా దయానంద్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ పాలనలో పేదలందరికీ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందుతున్నాయన్నారు. పిడమర్తి రవిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు.

పిడమర్తి మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే గంగారంలో వెయ్యి ఇళ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. పలు కుటుంబాలు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాయి. కార్యక్రమంలో ఎంపీపీ జ్యేష్ట అప్పారావు,  మండల అధ్యక్షుడు చల్లగుళ్ల నర్సింహారావు, గాదె సత్యనారాయణ, సోమరాజు సీతారామరాజు, రాచమళ్ల కృష్ణమూర్తి, మాదిరాజు వాసు, మోరంపూడి ప్రభాకర్, వినుకొండ కృష్ణ, మందపాటి రాజేంద్ర ప్రసాద్‌రెడ్డి, ఎస్‌కె ఖాసీం, దేవళ్ల దాసు, కొత్తూరు ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement