హరిప్రియకు స్వాగత ఏర్పాట్లు 

Welcome Arrangements For Haripriya In Yellandu - Sakshi

 హైదరాబాద్‌లో పార్టీ మారడంపై చర్చించి.. నియోజకవర్గానికి మొదటిసారి వస్తున్న ఎమ్మెల్యే 

స్వాగతం పలకాలని సమావేశంలో నిర్ణయించిన టీఆర్‌ఎస్‌ నేతలు 

నాయకత్వం వహించిన జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ దిండిగల రాజేందర్‌ 

సాక్షి, ఇల్లెందు: ఎమ్మెల్యే బాణోతు హరిప్రియ కేసీఆర్, కేటీఆర్‌లతో టీఆర్‌ఎస్‌లో చేరడంపై సమాలోచనలు చేసి ఇల్లెందుకు రానున్న సందర్భంగా స్వాగతం పలికేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేయాలని టీఆర్‌ఎస్‌ శ్రేణులు నిర్ణయించారు. దీనిపై శుక్రవారం ఇల్లెందు పెద్దమ్మగుడి వద్ద ఉన్న మామిడితోటలో సన్నాహాక సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. ఈ సమావేశానికి జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ దిండిగల రాజేందర్‌ నేతృత్వం వహించారు.

హరిప్రియ టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముందుకు రాగా సీఎం కేసీఆర్, పార్టీ అధ్యక్షులు కేటీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినందున ఇక మీదట హరిప్రియను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా భావించాలని, ఆ హోదాలో తొలిసారి ఇల్లెందుకు వస్తున్నందున ఘనంగా ఆహ్వానించాలని నిర్ణయించారు. ఆదివారం ఉదయం 11గంటలకు ఇల్లెందు మండల సరిహద్దు నుంచి భారీ మోటార్‌ సైకిల్‌ ర్యాలీతో పట్టణంలోనికి ఆహ్వానించాలని నిశ్చయించారు. ఆమెకు తనతో చేరే వారే వెంట ఉంటారనే ఊహాగానాలు తలకిందులవుతూ.. టీఆర్‌ఎస్‌లో ఉన్న వారంతా ఆమె వైపే మొగ్గు చూపడం కలిసి వచ్చినట్లయింది.

హరిప్రియ స్వాగత సన్నాహాక సభలో నాయకులు పులిగళ్ల మాధవరావు, కనగాల పేరయ్య, ఎస్‌.రంగనాధ్, గౌరిశెట్టి సత్యనారాయణ, బండారి వెంకన్న, లాకావత్‌ దేవీలాల్, అజ్మీరా భావ్‌సింగ్‌ నాయక్, సూర్నపాక సత్యనారాయణ, జేకే శ్రీను, మంచె రమేష్, మేకల మల్లిబాబు యాదవ్, వివిధ మండలాల నేతలు రెంటాల బుచ్చిరెడ్డి, శీలంశెట్టి ప్రవీణ్, తేజావత్‌ రవి, ఐలయ్య, సోమిరెడ్డి, వేముల వెంకట్, సర్పంచ్‌లో చాట్ల భాగ్యమ్మ, చీమల వీరభద్రం, మునిగంటి శివ, మార్కెట్‌ రాజు, యలమందల వాసూ,  రామచందర్, గిన్నారపు రాజేష్,     వంగా సునిల్‌  తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top