వెబ్‌ కౌన్సెలింగ్‌ రద్దు చేయాలి    | Web Counseling Should Be Canceled | Sakshi
Sakshi News home page

వెబ్‌ కౌన్సెలింగ్‌ రద్దు చేయాలి   

Jun 25 2018 5:47 PM | Updated on Aug 17 2018 2:56 PM

Web Counseling Should Be Canceled - Sakshi

డిప్యూటీ ఈవోకు వినతిపత్రం అందజేస్తున్న పీఆర్‌టీయూ నాయకులు 

ఆదిలాబాద్‌టౌన్‌ : వెబ్‌ కౌన్సెలింగ్‌ రద్దు చేసి పాత పద్ధతిలో (మాన్యువల్‌గా) బదిలీల కౌన్సెలింగ్‌ చే పట్టాలని పీఆర్టీయూ నాయకులు డిమాండ్‌ చేశా రు. జిల్లాకేంద్రంలోని డీఈవో కార్యాలయం ఎదు ట పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఆదివారం ధర్నా చేపట్టారు.

ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొమ్ము కృష్ణకుమార్, నల్ల రత్నాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానోపాధ్యాయులు వెబ్‌ అప్షన్లు పెట్టుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు.

అలాగే ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్లు అప్షన్లు ఇచ్చుకునేందుకు అవస్థలు పడాల్సి ఉంటుందన్నారు.ప్రభుత్వం వెంటనే స్పం దించి మాన్యువల్‌గా కౌన్సెలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డిప్యూటీఈవోకు వినతపత్రం అందజేశారు.

కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఇన్నారెడ్డి, మనోహర్, నిర్మల్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రమణారావు, ఎ. నరేంద్రబాబు, ఆసిఫాబాద్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, ప్రకాశ్, నాయకులు రామకృష్ణ, సత్యనారాయణగౌడ్, అర్చన, అరుణ, మధుసూధన్, రాజన్న, జయరాం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement