గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

Villages Developments Depend On All Peoples MP Godam Nagesh - Sakshi

ఇంద్రవెల్లి(ఖానాపూర్‌) : గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేశ్‌ అన్నా రు. ఇంద్రవెల్లి మండలం గిన్నేర గ్రామపంచాయతీ పరిధిలోని తుమ్మగూడ, సమాక గ్రామాలకు పంచాయతీరాజ్‌ శాఖ రూ.1 కోటి 4లక్షల, 50 వేలతో బీటీ రోడ్డు మంజూరు చేయగా ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌తో కలిసి శుక్రవారం రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రోడ్డు విస్తీర్ణంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుం దన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియో గం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ దేవ్‌పూజే సంగీత, ఏఎంసీ చైర్మన్‌ రాథోడ్‌ వసంత్‌రావ్, సర్పంచ్‌లు కనక తుల్సిరాం, పెందో ర్‌ దేవుబాయి, ఆడే విజయ, ఎంపీటీసీ కనక హనుమంత్‌రావ్, టీఆర్‌ఎస్‌ నాయకులు తుమ్మగూడ, సమాక గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట

ఉట్నూర్‌రూరల్‌(ఖానాపూర్‌) : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని ఆదిలాబాద్‌ పార్లమెంటు సభ్యుడు గోడం నగేశ్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని కామాయిపేట్, లక్కారం గ్రామాల్లో రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. గ్రామానికి వచ్చిన ఎంపీ, ఎమ్మెల్యేలను ఆదివాసీలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మరిన్ని రోడ్లు మంజూరు చేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఖానా పూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్, ఎంపీపీ విమల, జెడ్పీటీసీ జగ్జీవన్, సర్పంచ్‌ మర్సుకోల తిరుపతి, వైస్‌ ఎంపీపీ సలీమొద్దీన్, ఎంపీటీసీ రమేశ్, మండల అధ్యక్షుడు దాసండ్ల ప్రభాకర్, నాయకులు «అజీమొద్దీన్, ధరణిరాజేశ్, తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top