కుటుంబం కళ్లెదుటే.. యువతుల గల్లంతు | Two students drowned at Manjeera river | Sakshi
Sakshi News home page

కుటుంబం కళ్లెదుటే.. యువతుల గల్లంతు

Nov 5 2017 8:09 PM | Updated on Oct 16 2018 3:12 PM

Two students drowned at Manjeera river - Sakshi

సాక్షి, చిలప్‌చేడ్ : మెదక్ జిల్లా చిలప్‌చేడ్‌లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. మంజీరా నదిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు యువతులు గల్లంతయ్యారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. వనభోజనాల కోసం స్థానికంగా ఉన్న శ్రీ చాముండేశ్వరి ఆలయానికి కుటుంబ సభ్యులతో కలసి రోహిణి (18), శ్రీవిద్య(17) వెళ్లారు. అనంతరం స్నానం చేయడానికి మంజీరా నదిలోకి దిగారు. సింగూర్‌ ప్రాజెక్టు నుంచి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు నీరు ఒక్కసారిగా విడుదలవ్వడంతో నదిలో నీటి ప్రవాహం ఉధృతమైంది.  దీంతో కుటుంబసభ్యులు చూస్తుండగానే శ్రీవిద్య, రోహిణిలు నదిలో కొట్టుకుపోయారు.  విహారయాత్రకు వస్తే విషాదం మిగిలిందని యువతుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement