ఇసుక ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్రగాయాలు | two persons injuried in road accident | Sakshi
Sakshi News home page

ఇసుక ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్రగాయాలు

Apr 6 2015 6:14 AM | Updated on Aug 25 2018 5:33 PM

ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఇద్దరి వ్యక్తులకు కాళ్లు విరగి తీవ్ర గాయాలయ్యాయి.

నల్లగొండ: ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఇద్దరి వ్యక్తులకు కాళ్లు విరగి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం పెర్కకొండారం గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన పాలడుగు సైదులు(23), కేతేపల్లి మండలం కొర్లపహాడ్ గ్రామానికి చెందిన బొల్లేపల్లి ఉదయ్(25) ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మోటారుసైకిల్‌పై నకిరేకల్‌కు వెళ్తున్నారు. అదే సమయంలో మండలంలోని ఇటుకులపహాడ్ సమీపంలోని మూసీ నుంచి ఇసుకతో వస్తున్న ట్రాక్టర్ గ్రామంలోని ఉన్నత పాఠశాల వద్ద అకస్మాత్తుగా మలుపు తిప్పటంతో బైక్‌ను ఢీకొట్టింది.

 

ఈ ప్రమాదంలో సైదులు, ఉదయ్‌లకు కాళ్లు విరగడంతో పాటు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే 108 వాహనంలో నకిరేకల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో నార్కట్‌పల్లిలోని కామినేని హాస్పిటల్ కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement