మండలంలోని ఇబ్రహీంపేట శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఎస్‌ఐ భోజ్యనాయక్ తెలిపిన వివరాల ప్రకారం..
హాలియా: మండలంలోని ఇబ్రహీంపేట శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఎస్‌ఐ భోజ్యనాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండలం బంకాపురం గ్రామానికి చెందిన గాడిపర్తి మురళీ(48) ఆదివారం ఉదయం ఇంటి నుంచి పొలం వద్దకు వెళ్తున్నాడు. ఇబ్రహీంపేట శివారులో రోడ్డు దాటుతుండగా నల్లగొండ నుంచి హాలియా వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం అతన్ని ఢీకొట్టింది. తీవ్రగాయాలైన మురళీ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూ తుళ్లు ఉన్నారు. పోలీసులు సంఘటన స్థలిని పరిశీ లించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
చౌటుప్పల్: ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతిచెందారు. పోలీసులు తెలి పి న వివరాల ప్రకారం కృష్ణా జిల్లా నందిగామ నుంచి హైదరాబాద్‌కు ఇనుప లోడుతో వెళ్తున్న లారీ చౌటుప్పల్ మండలం ఎల్లగిరి క్రాస్‌రోడ్డు వద్ద రోడ్డు పక్క న ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణా జిల్లా నందిగామ మండలం అనాసాగర్‌కు చెందిన క్లీనర్ పాములపర్తి కోటేశ్వర్‌రావు(52) అక్కడికక్కడే మృతిచెందాడు. ఇదే గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ పూసల యేసు(30), కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన కూలి ఖాజా(36) తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటన స్థలాని కెళ్లి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ భూపతి గట్టుమల్లు తెలిపారు.