అస్తికలు గోదావరిలో కలపడానికి వెళ్లి.. | Two killed in road accident | Sakshi
Sakshi News home page

అస్తికలు గోదావరిలో కలపడానికి వెళ్లి..

Mar 25 2016 5:47 PM | Updated on Aug 30 2018 4:07 PM

తమ పూర్వికుల అస్థికలను గోదావరిలో కలిపి కుటుంబ సభ్యులంతా కలిసి తిరిగి వస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది.

- 25 మందికి గాయాలు
మంథని(కరీంనగర్)


తమ పూర్వికుల అస్థికలను గోదావరిలో కలిపి కుటుంబ సభ్యులంతా కలిసి తిరిగి వస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 25 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా మహదేవ్‌పూర్ మండలం పొదురుపల్లి వద్ద శుక్రవారం చోటుచేసుకుంది.


వివరాలు.. వరంగల్ జిల్లా మొగళ్లపల్లి మండలం ఎస్ పేటకు చెందిన మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తమ తల్లిదండ్రుల అస్థికలను కాళేశ్వరం వద్ద గోదావరిలో కలిపి తిరిగి బొలేరో వాహనంలో వస్తుండగా.. వాహనం పొదురుపల్లి వద్దకు చేరుకోగానే ముందు టైర్ పగిలి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో మోహన్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు మల్లారెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 25 మందికి గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement