తుమ్మలన్నా....రా...కదిలిరా.... | Tummala nageswara rao flexees row intensified in sattupalli | Sakshi
Sakshi News home page

తుమ్మలన్నా....రా...కదిలిరా....

Aug 23 2014 11:19 AM | Updated on Oct 2 2018 7:28 PM

తుమ్మలన్నా....రా...కదిలిరా.... - Sakshi

తుమ్మలన్నా....రా...కదిలిరా....

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో వెలిసిన తుమ్మల నాగేశ్వరరావు ఫ్లెక్సీలు... జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

ఖమ్మం : ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో వెలిసిన తుమ్మల నాగేశ్వరరావు ఫ్లెక్సీలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. జిల్లా అభివృద్ధి నీతోనే సాధ్యం అంటూ తుమ్మలన్నా... రా....కదిలిరా... అంటూ తుమ్మల వర్గీయుల పేరుతో భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి.  తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు పార్టీని వీడునున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆయన టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్దం చేస్తుకుంటున్నట్లు ఊహాగానాలు జోరందుకున్నారు.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తనను పనికట్టుకొని ఓడించారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసంతృప్తితో ఉన్నారు. కొంతకాలంగా అసంతృప్తితో రగిలిపోతున్న తుమ్మల టీఆర్‌ఎస్‌తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ను ఆయన కలిశారు. ఈ విషయాన్ని తుమ్ముల కూడా ధ్రువీకరించారు.

అధినేత చంద్రబాబు నాయుడు దగ్గర కూడా తనకన్నా తన ప్రత్యర్థివర్గం మాటే ఎక్కువగా చెల్లుబాటు అవుతుండడంతో... కలత చెందిన తుమ్మల తన వర్గీయులతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరును తుమ్మలను బుజ్జగించేందుకు తెలుగుతమ్ముళ్లు  చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది.

ఇక టీఆర్ఎస్లో ఎవరు చేరినా తనకు ఢోకాలేదని ఆ పార్టీ నాయకుడు, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు అన్నారు. తుమ్మల టీఆర్ఎస్లో చేరితో తనకేమీ ఇబ్బంది ఉండదన్నారు. పార్టీలో ఎవరు చేరినప్పటికీ తన ప్రాధాన్యత తనకు ఉంటుందన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement