ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర

TSRTC Incharge File A Separate Affidavit in RTC Strike Case - Sakshi

విపక్షంతో చేతులు కలిపిన ఆర్టీసీ యూనియన్‌

ఆర్టీసీ సమ్మె కేసులో టీఎస్‌ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ ప్రత్యేక అఫిడవిట్‌ దాఖలు

సాక్షి, హైదరాబాద్‌: నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆర్థిక సంక్షోభం ఊబిలోకి నెట్టి ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు యూనియన్‌ ప్రయత్నిస్తుందని, అందుకు విపక్షాలతో చేతులు కలిపి కుట్రకు పాల్పడుతోందని టీఎస్‌ ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌ శర్మ ఆరోపించారు. ఒక పక్క యాజమాన్యంతో చర్చలు జరుగుతుండగానే ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెలోకి వెళ్లాయని, తిరిగి విధుల్లో చేరేందుకు వారంతా ముందుకు వచ్చిన విధుల్లోకి చేర్చుకునేలా నిర్ణయం తీసుకోవడం కూడా కష్టమేనని హైకోర్టుకు తేల్చి చెప్పారు.

ఈ మేరకు టీఎస్‌ఆరీ్టసీ ఇన్‌చార్జి ఎండీ హోదాలో శనివారం ఆయన హైకోర్టులో స్పెషల్‌ అడిషినల్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఆర్టీసీ సిబ్బంది కోసం కాకుండా ప్రతిపక్ష రాజకీయపారీ్టల కోసం ఆర్టీసీ యూనియన్‌ అడుగులు వేస్తోందన్నారు. ఆర్టీసీ ఉనికినే దెబ్బతీస్తుంటే యాజమాన్యం చేతులు కట్టుకుని కూర్చోబోదని చెప్పారు. యూనియన్‌లో కొందరి తప్పిదాల వల్ల ప్రజలు, ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ సంస్థ ఇబ్బందులు పడుతున్నా రని చెప్పారు. యూనియన్‌ మొండిగా వ్యవహరించిందని, బెదిరింపులకు దిగే క్రమంలోనే దసరాకు ముందు సమ్మెలోకి దిగారని చెప్పారు.

ఆర్టీసీ కారి్మకులు చేపట్టిన సమ్మె చట్ట విరుద్ధమని చెప్పారు. పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్‌ 22 ప్రకారం ఆరు వారాలు లేదా 14 రోజులు ముందుగా నోటీసు ఇవ్వాలని, కన్సిలియేషన్‌ జరుగుతుంటే సమ్మెలోకి వెళ్లడం అదే చట్టంలోని సెక్షన్‌ 24 ప్రకారం సమ్మె చట్ట వ్యతి రేకం అవుతుందన్నారు. చట్ట వ్యతిరేకంగా సమ్మెలోకి వెళితే నెల రోజులపాటు జైలు శిక్షతోపాటు జరిమానాలను విధించేందుకు వీలుందన్నారు.
డిమాండ్లను పరిష్కరించే

పరిస్థితి లేదు..
యూనియన్‌ డిమాండ్లను పరిష్కరించే పరిస్థితుల్లో ఆర్టీసీ కార్పొరేషన్‌ లేదన్నారు. అగ్గి రాజేసి చలి కాచుకునే ధిక్కార ధోరణి/ క్రమశిక్షణారాహిత్యాలను ఉపేక్షించబోమని గట్టిగా నొక్కి చెప్పారు. సమ్మె పాశుపతాస్త్రం లాంటిదని, అయినదానికీ కానిదానికీ దానిని ప్రయోగించకూడదని, సమ్మె హక్కు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుగా లేదన్నారు. ప్రజా సరీ్వసుల్లోని సిబ్బంది సమ్మె చేస్తామని నోటీసు ఇవ్వడమే చట్ట విరుద్ధమని, 40 రోజుల సమ్మె వల్ల ఆర్టీసీ పరిస్థితే కాకుండా వ్యాపార, ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావం పడుతుందని అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌తో మొండిగా వ్యవహరించిన యూనియన్‌ ఆ డిమాం డ్‌ను ప్రస్తుతానికి పక్కకు పెట్టిందన్నారు.

యూనియన్‌ మొండి వైఖరిని అనుసరించిందనడానికి ఇదే పెద్ద నిదర్శనమన్నారు. భవిష్యత్తులో ఎప్పుడైనా మళ్లీ విలీనం డిమాండ్‌ను తెరపైకి తెచ్చి ప్రభుత్వా న్ని అస్థిరపరిచే అవకాశాలు లేకపోలేదనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. యూనియన్‌ సమ్మె వల్ల ఉన్న నిల్వ నిధులు కాస్తా ఖర్చు అవుతున్నాయని, నష్టాల నుంచి భారీ నష్టాల ఊబిలోకి వెళ్లే పరిస్థితిని తీసుకొచ్చారని ఆరోపించారు. పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నష్టాల్లో ఉన్నప్పటికీ ఆర్టీసీ సిబ్బందికి 44% జీతాల పెంపు, 16% మధ్యంతర భృతి ఇచ్చామని చెప్పారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా హైకోర్టు సత్వరమే ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.

బస్సు రూట్ల ప్రైవేటీకరణ ప్రక్రియ పూర్తి కాలేదు: సీఎస్‌
ఆర్టీసీ 5,100 బస్సు రూట్లను ప్రైవేటీకరించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం రహస్యమని, సెక్రటేరియట్‌ పరిధి దాటి ఆ వివరాలు ఇచ్చేందుకు వీల్లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీకే జోషి హైకోర్టుకు తెలియజేశారు. క్యాబినెట్‌ నిర్ణయ ప్రక్రియ పూర్తి కాలేదని, ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడేలోగా ఆ నిర్ణయంలో మార్పుచేర్పులకు ఆస్కారం ఉంటుందన్నారు. జీవో వచ్చాకే క్యాబినెట్‌ నిర్ణయానికి పూర్తి సార్థకత వస్తుందన్నారు. ఈలోగా క్యాబినెట్‌ నిర్ణయాన్ని ప్రశ్నించేందుకు వీల్లేదని రాజ్యాంగంలోని 166(1) అధికరణం స్పష్టం చేస్తోందన్నారు. రవాణా చట్టం కూడా అదే స్పష్టం చేస్తోందన్నారు.

బస్సు రూట్లను ప్రైవేటీకరణ చేయాలని క్యాబినెట్‌ తీర్మానాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. క్యాబినెట్‌ తీర్మానం నోట్‌ఫైల్స్‌లో భాగమని, సచివాలయం బయట ఉన్న వాళ్లకు ఆ వివరాలు ఇచ్చేందుకు వీల్లేదన్నారు. క్యాబినెట్‌ నిర్ణయం తర్వాత ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి గెజిట్‌ వెలువరించాలని, ఆ తర్వాత జీవో జారీ చేస్తేనే క్యాబినెట్‌ అమల్లోకి వస్తుందని, అప్పటి వరకూ ఆ నిర్ణయాన్ని సవాల్‌ చేయడం చెల్లదని, పిల్‌ను డిస్మిస్‌ చేయాలని ఆయన హైకోర్టును కోరారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top