టీజేఎస్‌లోకి టీఆర్‌ఎస్‌ నేతలు  | TRS leaders into the TJS | Sakshi
Sakshi News home page

టీజేఎస్‌లోకి టీఆర్‌ఎస్‌ నేతలు 

Oct 13 2018 2:30 AM | Updated on Oct 13 2018 2:30 AM

TRS leaders into the TJS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోరుట్ల నియోజకవర్గానికి చెందిన పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు తెలంగాణ జన సమితి (టీజేఎస్‌)లో చేరారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు కోదండరాం సమక్షంలో కోరుట్ల నియోజకవర్గం ఇబ్రాయపట్నం మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు టి.లక్ష్మి, ఎంపీటీసీలు బోనెత్తి వసంత గంగారెడ్డి, వార లక్ష్మి ప్రసాద్,ద్యావతి పరిమళ ఈశ్వర్‌లు పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. మరోవైపు శుక్రవారం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు కోదండరాం, మహిళా నేతలు రచనారెడ్డి, లక్ష్మి, మమత, భవానిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement