కాంగ్రెస్‌ నాయకులకు అభివృద్ధి కనిపించడం లేదా?  | TRS Leaders Comments On Congress Leaders Adilabad | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ నాయకులకు అభివృద్ధి కనిపించడం లేదా? 

Jul 6 2018 11:12 AM | Updated on Mar 18 2019 9:02 PM

TRS Leaders Comments On Congress Leaders Adilabad - Sakshi

మాట్లాడుతున్న ఎంపీపీ సంజీవ్‌ కుమార్‌

రెబ్బెన: స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మి, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌ల చొరవతో రెబ్బెన మండలంలో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు కనిపించటం లేదా అని ఎంపీపీ కార్నాథం సంజీవ్‌కుమార్‌ ప్రశ్నించారు. గురువారం మం డల కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వంకులంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ పా ర్టీ నాయకులు తమ ప్రభుత్వ హయాంలోనే రెబ్బె న మండలంలో అభివృద్ధి జరిగిందని టీఆర్‌ఎస్‌ ఎలాంటి అభివృద్ది చేయలేదని వ్యాఖ్యానించట్టా న్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ హయాంలో అద్వానంగా ఉన్న అంతర్గత రోడ్లతో ప్రజలందరూ అనేక ఇబ్బందులకు గురయ్యారని అన్నారు.ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ప్రత్యేక చొరవతో మండలంలోని అన్ని గ్రామాల్లో అంతర్గత రోడ్లతో పాటు ప్రధాన రహాదారుల కోసం రూ. 10 కోట్లు ఖర్చు చేశారన్నారు.  సమావేశంలో ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ కుందారపు శంకరమ్మ, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు నాగయ్య, సర్పంచ్‌ గజ్జల సుశీల, నాయకులు చెన్న సోమశేఖర్, సుదర్శన్‌గౌడ్, శ్రీధర్, నవీన్‌ జైస్వాల్, చిరంజీవిగౌడ్, వెంకటేశ్వర్‌గౌడ్, వసంత్‌రావు, గజ్జల సత్యనారాయణ, రాజాగౌడ్, వినోద్‌జైస్వాల్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement