వలసలంటూ టీఆర్ఎస్ మైండ్గేమ్: పొంగులేటి | trs is playing mind game, alleges ponguleti sudhakar reddy | Sakshi
Sakshi News home page

వలసలంటూ టీఆర్ఎస్ మైండ్గేమ్: పొంగులేటి

Published Tue, Oct 14 2014 3:41 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

వలసలంటూ టీఆర్ఎస్ మైండ్గేమ్: పొంగులేటి - Sakshi

వలసలంటూ టీఆర్ఎస్ మైండ్గేమ్: పొంగులేటి

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ను కలిశారే తప్ప.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ను కలిశారే తప్ప.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి అన్నారు. వాళ్లు కేవలం నియోజకవర్గ సమస్యల మీద మాత్రమే ముఖ్యమంత్రిని కలిశారని చెప్పారు. టీఆర్ఎస్ నేతలు మాత్రం ఎమ్మెల్యేల వలసలు అంటూ మైండ్ గేమ్ ఆడుతున్నారని పొంగులేటి మండిపడ్డారు. ఏఐసీసీ పిలుపుమేరకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా బుధవారం ఢిల్లీ వెళ్తున్నారని, పార్టీ సంస్థాగత అంశంపై చర్చిస్తామని అన్నారు.

రేషన్ కార్డులు, పింఛను కార్డుల జారీ విషయంలో ప్రభుత్వం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని పొంగులేటి విమర్శించారు. ఇంటివద్దనే కార్డులు ఇవ్వాల్సింది పోయి.. వారిని ఆఫీసుల చుట్టూ తిప్పడం సరికాదని అన్నారు. మన ఊరు - మన ప్రణాళిక పేరుతో సమగ్ర సర్వేలు చేసినా, మళ్లీ కార్డుల జారీలో మాత్రం అయోమయం నెలకొనడం కేసీఆర్ పాలన వైఫల్యానికి నిదర్శనమని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement