
టీఆర్‌ఎస్‌లోకి బిరుదు
పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బిరుదు రాజమల్లు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సన్నద్ధమవుతున్నట్లు ....
అనుచరులతో మంతనాలు మార్చి 4న ముహూర్తం
సుల్తానాబాద్: పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బిరుదు రాజమల్లు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నెల 24న మెట్‌పల్లిలో జరిగిన ఎంపీ బాల్క సుమన్ సోదరి వివాహానికి సీఎం కేసీఆర్ హాజరయ్యూరు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రాజమల్లును పలికరించారు. ఏపార్టీలో ఉన్నారని ఆరాతీయడంతో.. కాంగ్రెస్‌లో ఉన్నానని చెప్పారు. హైదరాబాద్‌కు వచ్చి తనను కలవాలని కేసీఆర్ సూచించారు. దీంతో బిరుదు రాజమల్లు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి కలిసివచ్చినట్లు ప్రచారం సాగుతోంది. తన అనుచరులతో ఇప్పటికే ఫోన్లో సంప్రదింపులు జరుపుతున్నారు. మార్చి 4న సీఎం సమక్షంలో టీర్‌ఎస్‌లో చేరేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది.