కోతల్లేకుండా మెదడులో కణితి తొలగింపు | Treatment with the help of endoskosi | Sakshi
Sakshi News home page

కోతల్లేకుండా మెదడులో కణితి తొలగింపు

Nov 27 2014 1:32 AM | Updated on Sep 2 2017 5:10 PM

కోతల్లేకుండా మెదడులో కణితి తొలగింపు

కోతల్లేకుండా మెదడులో కణితి తొలగింపు

శరీరంపై కత్తిగాటు లేకుండా... సూది, దారంతో పనిలేకుండా.. కేవలం ఎండోస్కోపీతో కణితిని సిటిజన్స్ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా తొలగించారు.

  • ఎండోస్కోసీ సహాయంతో చికిత్స  
  •  నగర వైద్యుల ఘనత
  • సాక్షి, హైదరాబాద్: శరీరంపై కత్తిగాటు లేకుండా... సూది, దారంతో పనిలేకుండా.. కేవలం ఎండోస్కోపీతో కణితిని సిటిజన్స్ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా తొలగించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఈ చికిత్స వివరాలను ఆసుపత్రి వైద్య బృందం మీడియాకు వివరించింది. నగరంలోని రాజ్‌భవన్‌రోడ్డుకు చెందిన మహ్మద్‌షోయబ్(14) ‘ఆంజియో ఫైబ్రోమా’గా పిలిచే పుర్రెకు సంబంధించిన కణితి (ముక్కు నుంచి రక్తం కారడం) వ్యాధితో బాధపడుతున్నాడు.

    మూడు నెలల కిందట సిటిజన్స్ ఆస్పత్రిలో చేరాడు. అతడిని పరీక్షించిన వైద్యులు ముక్కు, సైనస్ ఎముక, గొంతు వెనకభాగం నుంచి మెదడులోని పుర్రె వరకు 6.5 సెం.మీ. పరిమాణంలో కణితి విస్తరించి ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా ఇలాంటి కణితిని శస్త్రచికిత్స చేసి కత్తితో తొలగించాల్సి ఉంటుంది.

    కానీ రైనాలజీ, ఆంకోసర్జరీ, న్యూరో, రేడియాలజీ వైద్యులు బృందంగా ఏర్పడి పది రోజుల కిందట సిటీస్కాన్‌కు నావిగే షన్ పరిజ్ఞానంతో  ఎండోస్కోపీ సహాయంతో ముక్కు రంధ్రాల నుంచి కణితిని విజయవంతంగా తొలగించారు. ప్రతి లక్షమందిలో ఒక రికి మాత్రమే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందని డాక్టర్లు తెలిపారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement