పారదర్శకంగా నాణ్యత పరీక్షలు 

Transparent quality tests in Petrol bunks - Sakshi

పెట్రోల్, డీజిల్‌ బంకుల్లో కొత్త జార్‌ అందుబాటులోకి..

సాక్షి, హైదరాబాద్‌: బంకుల్లో పెట్రోల్, డీజిల్‌ తూకం, నాణ్యతల పరీక్షలు మరింత పారదర్శకం గా ఉండేందుకు తూనికల కొలతల శాఖ సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగా గాజుతో తయారు చేసిన 5 లీటర్ల ఓ కొత్త జార్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ గాజు జార్‌ను యుఎస్‌పీ టైప్‌ క్లాస్‌–ఏతో తయారు చేశారు. అందులో పోసే ఇంధనం స్పష్టంగా కనబడటంతోపాటు సరైన తూకాన్ని సూచిస్తుంది. ఈ జార్‌లో ఎలాంటి మార్పులు చేయడానికి అవకాశం ఉండదు.

సోమవారం పౌరసరఫరాల భవన్‌లో గ్రేటర్‌ హైదరాబాద్‌ పెట్రోల్‌ అండ్‌ డీజిల్‌ డీలర్స్‌ అసోసియేషన్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌ ఆయిల్‌ కంపెనీలతో జరిగిన సమావేశంలో ఈ పరికరాన్ని తూనికల కొలతల శాఖ కంట్రోలర్‌ అకున్‌ సబర్వాల్‌ పరిశీలించారు. ఈ పరికరాలను ఆయా పెట్రోల్‌ బంక్‌ యాజమాన్యాలే సమకూర్చుకోవాలని సూచించారు. వీటిని వినియోగించేందుకు తూనికల కొలతల శాఖ నుంచి ధ్రువీకరణపత్రం పొందాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో రాష్ట్ర పెట్రోల్, డీజిల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాజీవ్‌ అమరం, గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రధాన కార్యదర్శి అమరేందర్‌రెడ్డి, హెచ్‌పీసీఎల్‌ డీజీఎం (రిటైల్‌) రాజేశ్, బీపీసీఎస్‌ మేనేజర్‌ శ్రావణ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top