ప్రభుత్వం హామీలన్నీ నెరవేర్చాలి | The government must complete their homies | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం హామీలన్నీ నెరవేర్చాలి

Jul 20 2014 1:57 AM | Updated on Sep 2 2017 10:33 AM

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం నెరవేర్చాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కంట్రోల్ కమిటీ చైర్మన్ టి.వి.చౌదరి డిమాండ్ చేశారు.

జూలూరుపాడు: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం నెరవేర్చాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కంట్రోల్ కమిటీ చైర్మన్ టి.వి.చౌదరి డిమాండ్ చేశారు. జూలూరుపాడులో శనివారం జరిగిన  సీపీఐ మండల ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా టీవీ చౌదరి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తక్షణమే రైతుల  రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్  రెండు నెలలు కావస్తున్నా స్పష్టమైన ప్రకటన చేయకుండా నాన్చుడు ధోరణి అవలింబిస్తున్నారని విమర్శించారు. ఖరీఫ్  ప్రారంభమై రెండు నెలలవుతున్నా ప్రభుత్వం కొత్త రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారన్నారు.

 తక్షణమే రుణాలు అందించి ఆదుకోవాలన్నారు. ఈసం నరసింహ అద్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఐ వైరా నియోజకవర్గ కార్యదర్శి దొండపాటి రమేష్, రైతు సంఘం  జిల్లా నాయకులు ఆడప కోటయ్య, మండల కార్యదర్శి చండ్ర నరేంద్రకుమార్, ఎదళ్లపల్లి వీరభద్రం, యల్లంకి మధు, గుండెపిన్ని వెంకటేశ్వర్లు, కిలారు ముత్యాలు, నాగయ్య,  చాంద్‌పాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement