22 నుంచి తెలంగాణ వైఎస్‌ఆర్‌ సీపీ ప్లీనరీ | telangana ysrcp plenary to be held on June 22nd | Sakshi
Sakshi News home page

22 నుంచి తెలంగాణ వైఎస్‌ఆర్‌ సీపీ ప్లీనరీ

Jun 13 2017 3:03 PM | Updated on Sep 5 2017 1:31 PM

ఈ నెల 22న హైదరాబాద్‌లో జరగనున్న తెలంగాణ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశానికి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

హైదరాబాద్‌ : ఈ నెల 22న హైదరాబాద్‌లో జరగనున్న తెలంగాణ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశానికి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు టీ.వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ 8వేల మందితో ప్లీనరీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

పార్టీ బలోపేతం, కేసీఆర్‌ పాలనా వైఫల్యాలపై చర్చిస్తామని గట్టు శ్రీకాంత్‌ రెడ్డి వెల్లడించారు. మియాపూర్‌ భూ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్‌ కార్యక్రమం ఎనీవేర్‌ కరప్షన్‌గా మారిందన్నారు. కేసీఆర్‌ సర్కార్‌ వైఫల్యం వల్లే టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి భూ కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement