హైదరాబాద్‌ నగర సిగలో మణిహారం | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన ఎల్‌బీ నగర్‌  ఫ్లై ఓవర్‌

Published Fri, Mar 1 2019 11:14 AM

Telangana Ministers Inaugurates LB Nagar Flyover - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరం నుంచి హయత్‌ నగర్‌, చౌటుప్పల్, విజయవాడ వెళ్లే ప్రయాణికుల ట్రాఫిక్‌ కష్టాలు తీరాయి. ఎల్‌బీ నగర్‌లో నూతనంగా నిర్మించిన ఫ్లై ఓవర్‌ శుక్రవారం ప్రారంభమైంది. మంత్రులు మహమూద్‌ అలీ, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానం కిషోర్లు ఫ్లై ఓవర్‌ను ప్రారంభించారు. ఎస్సార్‌డీపీ పథకంలో భాగంగా జీహెచ్‌ఎంసీ చేపట్టిన ఫ్లై ఓవర్‌లలో ఇది మూడవది. మొత్తం రూ. 42 కోట్లు ఈ  ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి ఖర్చైంది. దీన్ని ప్రీకాస్ట్‌, పోస్ట్‌ టెన్షన్డ్‌ టెక్నాలజీతో నిర్మించారు. దీన్ని సంవత్సర కాలంలోనే పూర్తి చేసినప్పటికి ప్రారంభోత్సవం కోసం నెల పట్టింది.

ఈ ఫ్లై ఓవర్‌తో ఇటువైపు వెళ్లేవారికి ట్రాఫిక్‌ ఇబ్బంది తగ్గి సమయం కలిసి రానుంది. విజయవాడ వైపు నుంచి నగరంలోకి వచ్చేవారి కోసం కుడివైపు ఫ్లై ఓవర్, రింగ్‌ రోడ్డ వద్ద అండర్‌ పాస్‌ల నిర్మాణం కూడా పూర్తయితే ఎల్బీ నగర్ జంక్షన్‌లో ట్రాఫిక్‌ జంఝాటం ఉండది. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ఇంధనం, వాహన నిర్వహణ వ్యయం కూడా తగ్గనుంది. 

  

ఎల్‌బీనగర్‌ ఫ్లై ఓవర్‌ (ఎడమవైపు) కథ ఇదీ..  
పొడవు : 780 మీటర్లు 
వెడల్పు : 12 మీటర్లు 
స్టాండర్డ్‌ స్పాన్స్ ‌: 270 మీ. 
ఆబ్లిగేటరీ స్పాన్ ‌: 110 మీ. 

  • ర్యాంపుల పొడవు : 400 మీ. (హైదరాబాద్‌ వైపు 187 మీ., విజయవాడ వైపు 213 మీ.) 
  • క్యారేజ్‌ వే : 11 మీ. 3 లేన్లు, వన్‌వే  
  • ఎంఎస్‌ హ్యాండ్‌ రెయిలింగ్, ఎల్‌ఈడీ లైటింగ్, యాంటీ కార్పొనేట్‌ పెయింటింగ్స్‌  
  • అంచనా వ్యయం : రూ. 42 కోట్లు 

సదుపాయాలిలా.. 

  • ఈ వంతెన అందుబాటులోకి వస్తే చౌరస్తాలో 90 శాతం ట్రాఫిక్‌ సమస్య పరిష్కారమవుతుంది. 
  • మెట్రోరైలు రాకకు ముందు రద్దీ సమయంలో వెళ్లే వాహనాలు: 14,153 
  • మెట్రో రైలు వచ్చాక రద్దీ సమయంలో వాహనాలు: 8,916 
  • 2034 నాటికి జంక్షన్‌లో రద్దీ సమయంలో గంటకు వెళ్లే వాహనాలు: 21,990 


తగ్గనున్న ట్రాఫిక్‌ చిక్కులు 

ఈ ఫ్లై ఓవర్‌తో నగరం నుంచి హయత్‌నగర్, చౌటుప్పల్, విజయవాడల వైపు వెళ్లే వారికి ట్రాఫిక్‌ ఇబ్బంది తగ్గి సమయం కలిసి వస్తుంది. విజయవాడ వైపు నుంచి నగరంలోకి వచ్చేవారి కోసం కుడివైపు ఫ్లై ఓవర్, రింగ్‌రోడ్‌ వద్ద అండర్‌పాస్‌ల నిర్మాణం కూడా పూర్తయితే ఎల్‌బీనగర్‌ జంక్షన్‌లో ట్రాఫిక్‌ జంఝాటం ఉండదు. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ఇంధనం, వాహన నిర్వహణ వ్యయం కూడా తగ్గుతాయి. వాయు, ధ్వని కాలుష్యం కూడా తగ్గుతాయి. 

రూ.448 కోట్లతో ప్యాకేజీ–2  
ప్రభుత్వం దాదాపు రూ.25 వేల కోట్లతో చేపట్టిన ఎస్సార్‌డీపీ పనుల్లో ప్యాకేజీ–2లో భాగంగా ఎల్‌బీనగర్‌ పరిసరాల్లోని నాలుగు జంక్షన్ల వద్ద నిర్మించ తలపెట్టిన ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల అంచనా వ్యయం మొత్తం రూ.448 కోట్లు. ప్రస్తుతం ప్రారంభోత్సవం జరుపుకుంటున్న ఫ్లై ఓవర్‌ను రూ.42 కోట్ల వ్యయంతో నిర్మించారు.

Advertisement
Advertisement