
రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన చేయాలి: చిన్నారెడ్డి
రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి డిమాండ్ చేశారు. మొత్తం రుణమాఫీ జరగకపోవటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని
హైదరాబాద్ : రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి డిమాండ్ చేశారు. మొత్తం రుణమాఫీ జరగకపోవటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆయన సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభలో ప్రస్తావించారు. రైతుల ఆత్మహత్యలను నివారించాలని చిన్నారెడ్డి సూచించారు. బంగారం కుదవపెట్టి అప్పు తీసుకున్నవారు రుణమాఫీ కిందకు రావటం లేదన్నారు. రూ.4,500 కోట్లతో 25 శాతం మాత్రమే ప్రభుత్వం రుణమాఫీ ఇచ్చిందని చిన్నారెడ్డి అన్నారు. బంగారం రుణాల మాఫీపై రైతుల్లో గందరగోళం నెలకొందని ఆయన పేర్కొన్నారు.