సీఎం పచ్చి మోసకారి: డీఎస్ | telangana congress leaders slam kcr in karimnagar | Sakshi
Sakshi News home page

సీఎం పచ్చి మోసకారి: డీఎస్

Oct 17 2014 3:33 PM | Updated on Mar 18 2019 8:51 PM

సీఎం పచ్చి మోసకారి: డీఎస్ - Sakshi

సీఎం పచ్చి మోసకారి: డీఎస్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చి మోసకారి అని, ఆయన తన కుటుంబ సభ్యులకు తప్ప మరెవ్వరికీ మేలు చేయరని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ అన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చి మోసకారి అని, ఆయన తన కుటుంబ సభ్యులకు తప్ప మరెవ్వరికీ మేలు చేయరని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేస్తున్న రైతు భరోసా యాత్రలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ తలవంచి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పేవరకు రైతు సమస్యలపై తాము ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పారు.

గోదావరి దాటి నాలుగు అడుగులు వేస్తే ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు వస్తుందన్న తెలంగాణ సీఎం కేసీఆర్ది అవగాహన రాహిత్యమా.. లేక ప్రజలను మోసం చేయడమా అని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుందూరి జానారెడ్డి ప్రశ్నించారు. కరెంటు సమస్యలు, రైతుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని జానారెడ్డి స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement