తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం యాదగిరిగుట్ట చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో చేరుకున్న ఆయన యదగిరిగుట్ట పరిసర ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించారు.
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం యాదగిరిగుట్ట చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో చేరుకున్న ఆయన యదగిరిగుట్ట పరిసర ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. తెలంగాణ తిరుపతిగా యాదగిరిగుట్టను అభివృద్ధి చేయడానికి రూపొందించిన మాస్టర్ ప్లాన్ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి కేసీఆర్ ఈ ఏరియల్ సర్వే చేశారు. తిరుపతికి దీటుగా సుమారు రూ.700కోట్లతో యాదగిరిగుట్ట అభివృద్ధికి అవసరమైన అంశాలను ఆయన ప్రస్తావించారు. ఈ ఏరియల్ సర్వేలో ఎంపీ డాక్టర్ బుర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే గొంగిడ సునీత, కలెక్టర్ చిరంజీవులు పాల్గొన్నారు.
ఏరియల్ సర్వే అనంతరం యాదగిరిగుట్టలోని హెలిపాడ్ నుంచి రోడ్డు మార్గాన కేసీఆర్ కొండపైకి చేరుకుంటారు. స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్లొంటారు. కాగా యాదగిరిగుట్ట లక్ష్మీ నర్సింహస్వామి కేసీఆర్కు అత్యంత ఇష్టదైవం. అధికారంలోకి వచ్చిన వెంటనే స్వామివారిని దర్శించుకోవటానికి ఆయన ప్రయత్నించినప్పటికీ పలు కారణాలతో రాలేకపోయారు.