ఇద్దరు పశువైద్యుల సస్పెన్షన్‌

Suspension of two veterinarians

సాక్షి, హైదరాబాద్‌: గొర్రెల పంపిణీలో అవకతవకలకు పాల్పడిన ఇద్దరు పశు వైద్యాధికారులను పశు సంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. అధికారుల సస్పెన్షన్‌కు సంబంధించి ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

గొర్రెల కొనుగోలు, రవాణాలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన రాజన్న సిరిసిల్ల జిల్లా పశు వైద్యాధికారి కాంతయ్య, అదే జిల్లా రుద్రంగి మండల పశు వైద్యాధికారి మనోహర్‌కుమార్‌లను సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. గొర్రెల పంపిణీలో అవకతవకలకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని తలసాని హెచ్చరించారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top