రాష్ట్ర​ వ్యాప్తంగా నేరస్తుల సమగ్ర సర్వే | Survey of criminals in telangana from today | Sakshi
Sakshi News home page

రాష్ట్ర​ వ్యాప్తంగా నేరస్తుల సమగ్ర సర్వే

Jan 18 2018 11:22 AM | Updated on Aug 21 2018 6:02 PM

తెలంగాణ రాష్ట్ర​ వ్యాప్తంగా నేరస్తుల సమగ్ర సర్వే గురువారం ప్రారంభం అయింది.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర​ వ్యాప్తంగా నేరస్తుల సమగ్ర సర్వే గురువారం ప్రారంభం అయింది. పదేళ్లలో పోలీసు రికార్డుల్లో ఉన్న నేరగాళ్ల ఇళ్లకు అధికారులు, సిబ్బంది వెళ్లి వారి వివరాలను సేకరిస్తున్నారు. ఈ సర్వేలో కానిస్టేబుల్‌ నుంచి డీజీపీ వరకు అన్ని స్థాయిల అధికారులు పాల్గొన్నారు.

ప్రతి నేరస్తుడి సమాచారం, వారి ఇళ్లనూ జియో ట్యాగింగ్‌ చేసి టీఎస్‌ యాప్‌ పొందు పరచనున్నారు. గురువారం సర్వే పూర్తి కాని నేపథ్యంలో పూర్తయ్యే వరకు కొనసాగుందని, ప్రతి నేరస్తుడి ఆచూకీ కనిపెట్టి వివరాలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

రాచకొండ కమిషనరేట్ పరిధిలో
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సకల నేరస్థుల సమగ్ర సర్వే నిర్వహిస్తున్న పోలీసులు. సమగ్ర సర్వేలో భాగంగా ఎల్బీనగర్, వనస్దలిపురం, హయత్ నగర్, అబ్దుల్లా పూర్ మెట్  పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రాంతాలలో నేరాలు చేస్తున్నపలువురిని పోలీసులు గుర్తించి సర్వే నిర్వహిస్తున్నారు. ఎల్బీనగర్ - 951, వనస్దలిపురం -728, హయత్ నగర్ - 537, అబ్దుల్లా పూర్ మెట్ -124

సెంట్రల్ జోన్ పరిధిలో
2008 నుంచి సౌత్‌ జోన్‌ పరిధిలో 2269 మంది పాత నేరస్థుల ఉన్నట్టు గుర్తించారు. చిక్కడపల్లి -334, ముషీరాబాద్ -520, గాంధీనగర్ - 283, సైఫాబాద్ - 224, నాంపల్లి - 170, రాం గోపాల్ పేట్ - 70, అబిడ్స్- 123, నారాయణ గూడ - 229, బేగం బజార్ -165.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement