కొత్తడ్రెస్ కొనివ్వలేదని.. | student to commit suicide in nalgonda district | Sakshi
Sakshi News home page

కొత్తడ్రెస్ కొనివ్వలేదని..

Jun 7 2016 1:35 AM | Updated on Nov 9 2018 4:40 PM

కొత్తడ్రెస్ కొనివ్వలేదని.. - Sakshi

కొత్తడ్రెస్ కొనివ్వలేదని..

కొత్త డ్రెస్ కొనివ్వలేదని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

కిరోసిన్ పోసుకుని విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
 పరిస్థితి విషమం.. ఆస్పత్రికి తరలింపు
 సూర్యాపేట మండల పరిధిలో ఘటన

 
 సూర్యాపేట రూరల్ :  కొత్త డ్రెస్ కొనివ్వలేదని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన  సూర్యాపేట మండలం  పిల్లలమర్రి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలానికి చెందిన బాషపంగు పద్మ భర్త లింగయ్య మృతిచెందడంతో తమ తల్లిగారి గ్రామమైన పిల్లలమర్రిలో కూతురు మహేశ్వరితో కలిసి ఉంటోంది. మహేశ్వరి అడ్డగూడురు గురుకుల పాఠశాలలో పదవతరగతి ఇటీవల పూర్తి చేసుకుంది.
 
 అయితే తల్లి పద్మ కొంత కాలంగా హైదరాబాద్‌లో కూలీగా జీవనం సాగిస్తోంది. పదవతరగతి పూర్తి చేసుకున్న మహేశ్వరి అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటోంది. సోమవారం నల్లగొండలో నిర్వహించే ఓ కౌన్సెలింగ్ వెళ్లేందుకు తన తల్లిని హైదరాబాద్ నుంచి పిల్లలమర్రి పిలిపించుకుంది. కౌన్సెలింగ్‌కు వెళ్లేందుకు తనకు డ్రెస్, చెప్పులు కొనివ్వమని కోరింది. ప్రస్తుతానికి డబ్బులు లేదని చెప్పులు మాత్రమే కొనిస్తానని కూతురు చెప్పింది. దీంతో మనస్తాపానికి గురైనమహేశ్వరి తల్లి పెన్షన్ డబ్బులు తీసుకువచ్చేందుకు పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లగానే కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది.
 
  మంటలకు తాళలేక మహేశ్వరి కేకలు వేస్తుండడంతో చుట్టూ పక్కల వారు గమనించి తల్లికి సమాచారం అందించారు. వెంటనే వచ్చి మంటలు ఆర్పి 108 వాహనంలో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. మహేశ్వరి శరీరం 80 శాతం కాలిపోయినట్లు వైద్యులు పేర్కొంటున్నారు. ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహేశ్వరి నుంచి సూర్యాపేట తహసీల్దార్ మహమూద్‌అలీ, సూర్యాపేటరూరల్ ఏఎస్‌ఐ జహంగీర్ వాంగ్మూలం సేకరించారు. మహేశ్వరి తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సూర్యాపేటరూరల్ ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement