సరిగా చదవడంలేదని ఉపాధ్యాయుడు మందలించాడని ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్లగొండ పెద్దవూరులో జరిగింది.
సరిగా చదవడంలేదని ఉపాధ్యాయుడు మందలించాడని ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్లగొండ పెద్దవూరులో జరిగింది. ఓ విద్యార్థి సరిగా చదవడం లేదని ఉపాధ్యాయుడు మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న అతన్ని హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలించి చికిత్స చేయించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. దీంతో ఆగ్రహం చెందిన మృతిని బంధువులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి.