కొత్త పనులు చేపట్టొద్దు 

Stick to model code Chief Secretary tells Collectors - Sakshi

ప్రస్తుతం కొనసాగుతున్న పనులు, పథకాలు కొనసాగించండి

జిల్లా కలెక్టర్లతో సీఎస్‌ జోషి  

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల ప్రవర్తనా నియ మావళిని కచ్చితంగా పాటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి పేర్కొన్నారు. గురువారం సచివాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అంతకు ముందు వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల కోడ్‌ అమ లు నేపథ్యంలో జిల్లాలో పాలన తీరును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం పాలన సాగించాలన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, పనులు కొనసాగించాలని సూచించారు. కోడ్‌ నేపథ్యం లో కొత్త కార్యక్రమాలు చేపట్టొద్దని తెలిపారు.

కొత్తగా వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుకోసం తీసుకోవాల్సిన చర్యలను ఈనెల 31 లోగా పూర్తి చేయాలన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన ములుగు, నారాయణపేట జిల్లాలను గత ఏడాది వచ్చిన రాష్ట్రపతి గెజిట్‌లో చేర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. జీఏడీ ముఖ్యకార్యదర్శి అధర్‌ సిన్హా మాట్లాడుతూ, వివిధ శాఖల ఉన్నతాధికారులు ప్రొఫార్మా–1 పూర్తిచేశాయని, తమ శాఖలో ఉన్న పోస్టుల వివరాలను నిక్షి ప్తం చేయాలన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తిం చని ప్రత్యేకాధికారులు, రాష్ట్రస్థాయి అధికారుల ను ప్రొఫార్మా–5లోకి తీసుకురావాలన్నారు. బిజినెస్‌ రూల్స్‌ ప్రకారం కాంపిటెంట్‌ అథారిటీ అనుమతితో ఉత్తర్వుల జారీకి చర్య లు తీసుకోవాలని, ప్రతి శాఖకు సంబంధించిన పోస్టులను ఆర్థిక శాఖ రీకౌన్సిల్‌ చేస్తుందన్నారు. 

టీవెబ్‌ పోర్టల్‌కు నోడల్‌ అధికారి 
తెలంగాణ వెబ్‌ పోర్టల్‌కు ప్రతి శాఖ నుంచి నోడల్‌ అధికారిని నియమించాలని సీఎస్‌ సూచించారు. జిల్లాల్లో సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్స్, హరితహారం, ఎన్నికల కోడ్, కొత్తగా ఎన్నికైన సర్పంచులకు శిక్షణ, రెవెన్యూ, అటవీ భూముల సర్వే తదితర అంశాలపై కలెక్టర్లతో చర్చించారు. సాలిడ్‌వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కమిటి తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌ జస్టిస్‌ సీవీ రాములు మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్లు సాలిడ్‌వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ నియమాలపై సంబంధిత అధికారులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కృషి చేయాలన్నారు. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను జిల్లా కలెక్టర్లు సమర్పించాలన్నారు.

కొత్తగా ఎన్నికైన∙గ్రామ పంచాయతీల సర్పంచులకు శిక్షణా కార్యక్రమాన్ని ఈనెల 29లోగా పూర్తి చేయాలని సీఎస్‌ చెప్పారు. శిక్షణ పొందిన సర్పంచుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ సేకరించాలని తెలిపారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అజయ్‌ మిశ్రా, చిత్రా రామచంద్రన్, ముఖ్య కార్యదర్శులు శాంతికుమారి, రామకృష్ణారావు, సునీల్‌ శర్మ, వికాస్‌రాజ్, సోమేశ్‌కుమార్, శాలినీ మిశ్రా, పార్థసారథి, జగదీశ్వర్, శశాంక్‌ గోయల్, శివశంకర్, కార్యదర్శులు సందీప్‌ కుమార్‌ సుల్తానియా, బి.వెంకటేశం, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ నీతూ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top