
సాక్షి, హైదరాబాద్: రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్ సోమవారం తెలిపారు. కాచిగూడ–విశాఖపట్టణం (07016) ప్రత్యేక రైలు ఆగస్టు 7, 14, 21, 28, సెప్టెంబర్ 4, 11, 18, 25, అక్టోబర్ 2, 9, 16, 23, 30 తేదీల్లో సాయంత్రం 6.45కు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.50కి విశాఖ చేరుకుంటుంది. తిరుపతి–కాచిగూడ (07146) ప్రత్యేక రైలు ఆగస్టు 9, 16, 23, 30, సెప్టెంబర్ 6, 13, 20, 27, అక్టోబర్ 4, 11, 18, 25, నవంబర్ 1 తేదీల్లో సాయంత్రం 5 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30కు కాచిగూడ చేరుకుంటుంది.
లింగంపల్లి–విశాఖ (07148/07147) ప్రత్యేక రైలు ఆగస్టు 3, 10, 17, 24, 31, సెప్టెంబర్ 7, 14, 21, 28, అక్టోబర్ 5, 12, 19, 26 తేదీల్లో సాయంత్రం 5 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు విశాఖ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఆగస్టు 4, 11, 18, 25, సెప్టెంబర్ 1, 8, 15, 22, 29, అక్టోబర్ 6, 13, 20, 27 తేదీల్లో ఉదయం 10.15కు విశాఖలో బయలుదేరి అదే రోజు రాత్రి 11.10కి లింగంపల్లి చేరుకుంటుంది. లింగంపల్లి–కాకినాడ (07075/07076) ప్రత్యేక రైలు ఆగస్టు 5, 12, 19, 26, సెప్టెంబర్ 2, 9, 16, 23, 30, అక్టోబర్ 7, 14, 21, 28 తేదీల్లో ఉదయం 4.55 కు బయలుదేరి అదేరోజు సాయంత్రం 4.45కు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదేరోజు రాత్రి 7 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.45కు లింగంపల్లి చేరుకుంటుంది.