రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు | Special trains to clear extra rush | Sakshi
Sakshi News home page

రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు

Oct 11 2018 1:24 AM | Updated on Oct 11 2018 1:24 AM

Special trains to clear extra rush - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాకినాడ–సికింద్రాబాద్, సంత్రగాచి–చెన్నై సెంట్రల్‌ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమశంకర్‌కుమార్‌ బుధవారం తెలిపారు. కాకినాడ– సికింద్రాబాద్‌ (82715/ 82716) ప్రత్యేక రైలు ఈ నెల 21న సాయంత్రం 6 గంటలకు కాకినాడలో బయలుదేరి మర్నాడు ఉదయం 4.40కి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. తిరిగి ఈ నెల 22న ఉదయం 5.50కు సికింద్రాబాద్‌లో బయలుదేరి అదే రోజు సాయంత్రం 6కు కాకినాడ చేరుకుంటుంది.

సంత్రగాచి– చెన్నై సెంట్రల్‌ (02841/02842) ప్రత్యేక రైలు ఈ నెల 12, 19, 26, నవంబర్‌ 2 తేదీల్లో ఉదయం 12.40 గంటలకు సంత్రగాచిలో బయలుదేరి మర్నాడు సాయంత్రం 4.40 గంటలకు చెన్నై సెంట్రల్‌ చేరుతుంది. తిరిగి ఈ నెల 13, 20, 27, నవంబర్‌ 3వ తేదీల్లో సాయంత్రం 6.20 కు చెన్నై సెంట్రల్‌లో బయలుదేరి మర్నాడు రాత్రి 11.30 గంటలకు సంత్రగాచి చేరుకుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement