
సాక్షి, హైదరాబాద్: రద్దీ దృష్ట్యా హైదరాబాద్–నాగర్‌సోల్ మధ్య ప్రత్యేక రైలు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ శుక్రవారం తెలిపారు. హైదరాబాద్–నాగర్‌సోల్ ( 07064/07063) ప్రత్యేక రైలు ఈ నెల 26న మధ్యాహ్నం 3.15కు హైదరాబాద్‌లో బయలుదేరి మర్నాడు ఉదయం 5.50కి నాగర్‌సోల్ చేరుకుంటుంది. తిరిగి 29వ తేదీ సాయంత్రం 5.30కు నాగర్‌సోల్‌లో బయలుదేరి మర్నాడు ఉదయం 8.30కు హైదరాబాద్ చేరుకుంటుంది.
సికింద్రాబాద్–బికనీర్ ఎక్స్‌ప్రెస్ పొడిగింపు...
సికింద్రాబాద్–బికనీర్ (17034/17038) బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 22 నుంచి హిస్సార్ వరకు పొడిగించనున్నారు. రైలు ప్రతి మంగళ, బుధవారాల్లో రాత్రి 11.55కు సికింద్రాబాద్‌లో బయలుదేరి గురు, శుక్రవారాల్లో రాత్రి 11.05 గంటలకు హిస్సార్ చేరుకుంటుంది. తిరిగి ప్రతి శుక్ర, ఆదివారాల్లో ఉదయం 9.25కు హిస్సార్‌లో బయలుదేరి ఆది, మంగళవారాల్లో ఉదయం 8.50కి సికింద్రాబాద్ చేరుకుంటుంది.