ఆడుకోవడానికి వెళ్లి మృత్యు ఒడిలోకి..  | Small Boy While Playing In Canal Slipped And Died In Warangal | Sakshi
Sakshi News home page

ఆడుకోవడానికి వెళ్లి మృత్యు ఒడిలోకి.. 

Feb 10 2020 10:57 AM | Updated on Feb 10 2020 10:59 AM

Small Boy While Playing In Canal Slipped And Died In Warangal - Sakshi

రోదిస్తున్న తల్లిదండ్రులు, సాత్విక్‌ (ఇన్‌సెట్‌)

సాక్షి, చెన్నారావుపేట: చిన్నారులతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఎస్సారెస్పీ డీబీఎం–40 కాల్వలో పడి బాలుడు మృతి చెందిన ఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా చెన్నారావుపేట మండలంలోని కాల్‌నాయక్‌తండాలో ఆదివారం చోటు చేసుకున్నది. ఇదే గ్రామానికి చెందిన గుగులోతుఈరు–భద్రమ్మ దంపతుల కుమారుడు గుగులోతు సాత్విక్‌(6) మండల కేంద్రంలోని ఓ ప్రయివేట్‌ పాఠశాలలో నర్సరీ చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లారు. దీంతో పిల్లలు ఇంటి వద్దనే ఉన్నారు.

కాల్‌నాయక్‌తండా మీదుగా ఎస్సారెస్పీ డీబీఎం–40 కాల్వలో ఆటలు ఆడుకుంటూ ప్రమాదశాత్తు అందులో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. తండావాసులు గమనించి సాత్విక్‌ మృతదేహాన్ని బయటికి తీశారు. కుమారుడి మృతితో తల్లి దండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. సర్పంచ్‌ బాదావత్‌ రజిత, వీరన్న నాయక్‌లు నివాళులు అర్పించి కటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు.

Advertisement
 
Advertisement
Advertisement