పుర్రెలు, ఎముకలతో భయాందోళన | Skulls, bones in road side | Sakshi
Sakshi News home page

పుర్రెలు, ఎముకలతో భయాందోళన

Dec 3 2015 12:46 AM | Updated on Mar 28 2018 11:26 AM

పుర్రెలు, ఎముకలతో భయాందోళన - Sakshi

పుర్రెలు, ఎముకలతో భయాందోళన

పట్టణంలో మనిషి పుర్రెలు, ఎముకలు కలకలం సృష్టించాయి.

తాండూరు: పట్టణంలో మనిషి పుర్రెలు, ఎముకలు కలకలం సృష్టించాయి. జనవాసాల సమీపంలో రోడ్డు పక్కన పుర్రె, ఎముకలు కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ సంఘటన బుధవారం తాండూరులో వెలుగు చూసింది. వివరాలు.. తాండూరులోని యాదిరెడ్డి చౌక్ నుంచి పోలీసుస్టేషన్ వెళ్లే మార్గంలో రోడ్డుపక్కన ఓ ప్లాస్టిక్ కవర్‌ను పారిశుద్ధ్య సిబ్బంది గుర్తించారు. అందులో చూడగా మనిషికి చెందిన రెండు పుర్రెలు, ఎముకలు, దంతాలు కనిపించాయి.
 
  కౌన్సిలర్ పట్లోళ్ల నర్సింలు సమాచారంతో ఎస్‌ఐ మహ్మద్ ఖలీల్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
 పుర్రెలు, ఎముకలు గుర్తుతెలియని వ్యక్తులు కొద్దిదూరంలో ఉన్న శ్మశానంలో క్షుద్రపూజల కోసం వినియోగించి పడేసి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. పుర్రెలు, ఎముకలపై ఇంగ్లీష్‌లో మెడికల్ టర్మినాలజీ పదాలు రాసి ఉన్నాయని ఎస్‌ఐ చెప్పారు. ఆస్పత్రుల నిర్వాహకులు, లేదా ఎంబీబీఎస్ విద్యార్థులు తమ చదువుల నిమిత్తం పుర్రెలను తీసుకువచ్చి ఇక్కడ పడేసి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పుర్రెలు, ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement