'అబద్ధాల పునాదుల మీదే కేసీఆర్ సర్కార్ నడుస్తోంది' | Shabbir ali takes on telangana cm kcr | Sakshi
Sakshi News home page

'అబద్ధాల పునాదుల మీదే కేసీఆర్ సర్కార్ నడుస్తోంది'

Nov 9 2014 1:15 PM | Updated on Mar 18 2019 7:55 PM

'అబద్ధాల పునాదుల మీదే కేసీఆర్ సర్కార్ నడుస్తోంది' - Sakshi

'అబద్ధాల పునాదుల మీదే కేసీఆర్ సర్కార్ నడుస్తోంది'

తెలంగాణ సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఆదివారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు.

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఆదివారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. గతంలో చచ్చినా అబద్దమాడనంటూ తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు అదే పనిగా అబద్ధాలాడుతూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. అబద్దాల పునాదులపైనే కేసీఆర్ సర్కార్ నడుస్తోందని ఎద్దేవా చేశారు. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హమీలు... దళిత సీఎం, ముస్లిం రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్, 8 గంటల కరెంట్, తెలంగాణ ఉద్యమం సమయంలో అమరులైన కుటుంబాలను ఆదుకోవడం... అంశాల్లో కేసీఆర్ ఇచ్చిన మాట తప్పారని అబద్దాలు ఆడారని విమర్శించారు.

కేసీఆర్ అబద్ధాలన్నీ ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. ఆదివారం గాంధీభవన్లో పీసీసీ చీఫ్ పొన్నాల, పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు సమావేశమై తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితితోపాటు ఫిరాయింపులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్పై షబ్బీర్ అలీపై విధంగా స్పందించారు.

Advertisement
 
Advertisement
Advertisement