నేటి నుంచి బడులు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యా సంస్థలు 24 రోజుల తరువాత ప్రారంభం కాబోతున్నాయి. సోమ వారం నుంచి తరగ తులు నిర్వహించేందు కు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. దసరా సెలవుల్లో భాగంగా గత నెల 28 నుంచి మొదలైన సెలవులు ఈ నెల 13వ తేదీతోనే ముగియాల్సి ఉంది. అయితే ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల వాహనాలన్నీ ప్రజల కోసం నడుపుతున్నారు. దీంతో ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలకు సెలవులను ఈనెల 19 వరకు పొడిగించింది. 20వ తేదీ ఆదివారం కావడంతో సోమవారం పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
నేడు వీడియో కాన్ఫరెన్సు
విద్యాసంస్థలు తెరుచుకోనుండటంతో పరిస్థితిని అంచనా వేసి ఆదేశాలు జారీ చేసేందుకు వీలుగా రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సోమవారం ఉదయం 11 గంటలకు ఆర్టసీ, రవాణా శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి