స్వగ్రామానికి సత్యవేణి మృతదేహం | Satyaveni Body Was Shifted To West Godavari District | Sakshi
Sakshi News home page

స్వగ్రామానికి సత్యవేణి మృతదేహం

Nov 25 2019 2:34 AM | Updated on Nov 25 2019 2:34 AM

Satyaveni Body Was Shifted To West Godavari District - Sakshi

మూతపడిన ఫ్లై ఓవర్‌

గచ్చిబౌలి: గచ్చిబౌలి పరిధిలోని బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌ పై నుంచి శనివారం కారు పడిన ప్రమాదంలో మృతిచెందిన పసల సత్యవేణి(57) మృతదేహన్ని పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు గ్రామానికి తరలించారు. సత్యవేణి భర్త సోమశేఖర్‌ రావు మాదాపూర్‌లోని ఓ రెస్టారెంట్‌లో అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. పెద్ద కుమార్తె నాగ ప్రణీత ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసి 4 రోజుల క్రితమే ఉద్యోగానికి రాజీనామా చేసి మరో ఉద్యోగం కోసం వేచి చూస్తోంది. చిన్న కూతురు వాణి నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తోంది. కూతుళ్ల కోసమే సత్యవేణి, సోమశేఖర్‌ రావు హైదరాబాద్‌కు వచ్చి పుప్పాలగూడలోని శ్రీరాంనగర్‌లో నివాసం ఉంటున్నారు. కాగా, ఫ్లైఓవర్‌ ఘటనలో కృష్ణమిలాన్‌ రావుకు ఓవర్‌ స్పీడ్‌కు రూ.వెయ్యి  చలానా విధించారు.

Advertisement
 
Advertisement
Advertisement