పట్టా భూముల్లో కాసుల వేట! | sand mafia in degree lands | Sakshi
Sakshi News home page

పట్టా భూముల్లో కాసుల వేట!

May 22 2016 4:18 AM | Updated on Aug 28 2018 8:41 PM

పట్టా భూముల్లో కాసుల వేట! - Sakshi

పట్టా భూముల్లో కాసుల వేట!

పట్టా భూముల్లో ఇసుక మేటల తొలగింపు అనుమతుల్లో వివిధ శాఖల అధికారులు కాసుల వేట సాగిస్తున్నారు.

డబ్బులిస్తేనే ‘ఇసుక’ మేటలపై నివేదికలు
ఆ ఐదు శాఖల అధికారులదే ఇష్టారాజ్యం
ఇదే అదనుగా ఇసుక మాఫియా రంగప్రవేశం

 సాక్షి, హైదరాబాద్: పట్టా భూముల్లో ఇసుక మేటల తొలగింపు అనుమతుల్లో వివిధ శాఖల అధికారులు కాసుల వేట సాగిస్తున్నారు. దరఖాస్తుదారుల నుంచి డబ్బులు చేతిలో పడితే తప్ప సర్వేలు, నివేదికలు ముందుకు కదలడంలేదు. దీంతో మామూ ళ్ల రూపంలో లక్షలాది రూపాయలు ఇచ్చుకోలేని రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక మేటలు వేసిన పట్టా భూములను తిరిగి సాగు యోగ్యంగా మార్చేందుకుగానూ.. ఇసుక వెలికితీతకు అనుమతులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చిన నూతన ఇసుక విధానం నిబంధనల మేరకు పట్టా భూముల్లో ఇసుక మేటలను ధ్రువీకరించే బాధ్యతను ఐదు ప్రభుత్వ విభాగాలకు అప్పగించింది.

రెవెన్యూ, వ్యవసాయ, భూగ ర్భ జలవనరులు, గనులు, నీటిపారుదల శాఖకు చెందిన క్షేత్రస్థాయి అధికారుల నివేదికలు అనుమతుల ప్రక్రియలో కీలకం కావడంతో దరఖాస్తుదారులు తిప్పలు పడుతున్నారు. పట్టా భూమిని ధ్రువీకరించడంతో పాటు ఇసుక మేట వేసిన ప్రాంతా న్ని తహశీల్దార్ ధ్రువీకరించాలి. ఇసుక మేటను తొలగిస్తే భూమి సాగుకు యోగ్యమవుతుందని మండల వ్యవసాయ అధికారి నివేదిక ఇవ్వాలి. ఇసుకను యంత్రాల ద్వారా లేదా మనుషుల ద్వారా తొలగిం చాలా.. ఎంత పరిమాణంలో ఇసుక మేట వేసింది.. వంటి అంశాలను భూగర్భ వనరుల శాఖ నివేదించాలి. వెలికితీసే ఇసుక నిర్మాణాలకు అనువుగా ఉంటుందని గనులు, భూగర్భ వనరుల శాఖ అదనపు డైరక్టర్ సర్టిఫై చేయాలి.

నదీ తీరానికి ప్రతిపాదిత పట్టా స్థలం ఎంత దూరంలో ఉంది వంటి అంశాలను నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ధ్రువీకరిం చాలి. ఈ నివేదికల ఆధారంగా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా స్థాయి ఇసుక కమిటీ(డీఎల్‌ఎస్‌సీ) అనుమతులిచ్చి.. సదరు పట్టా భూమి ని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎండీసీ)కు అప్పగిస్తుంది. భూముల యజ మానులకు ఇసుక విక్రయాల ద్వారా సమకూరే ఆదాయంలో గరిష్టంగా ఘనపు మీటరుకు రూ.200 లేదా 35 శాతాన్ని టీఎస్‌ఎండీసీ చెల్లిస్తుంది.

 ఒక్కో శాఖది.. ఒక్కో బాగోతం..
పట్టా భూమి సరిహద్దులను నిర్ణయిస్తూ మ్యాప్‌లను రూపొందించడంలో రెవెన్యూ విభాగం సర్వేయర్లదే కీలకపాత్ర కావడంతో.. వీరు అడిగినంత ఇస్తే తప్ప పని కావడం లేదు. విస్తీర్ణాన్ని బట్టి ఎకరాకు ఒక్కో సర్వేయర్ రూ.లక్ష, తహశీల్దార్ రూ. 2 లక్షల చొప్పున డిమాండ్ చేస్తున్నారు. భూగర్భ జల వనరుల శాఖ అధికారులను ఫీల్డ్ విజిట్‌కు రప్పించేందుకు వాహనాలు, ఖరీదైన విందు ఏర్పాటు చేయాల్సిందే. ఆ తర్వాత నివేదిక కోసం ముడుపులు చెల్లిం చాల్సి ఉంటుంది.

వ్యవసాయ, నీటిపారుదల శాఖ అధికారులు కూడా డబ్బులు అందితేనే నివేదికలు చేతికిస్తున్నారు. అనుమతుల్లో కీలకమైన గనులు, భూగర్భ వనరుల శాఖ అధికారులు విస్తీర్ణం, పరిమాణా న్ని బట్టి ఎకరాకు రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత డీఎల్‌ఎస్‌సీ అనుమతులు, టీఎస్‌ఎండీసీ ఒప్పందాల కోసం నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ముడుపులిస్తే నివేదికలు తయారవుతుండటంతో ఇన్నాళ్లూ ఇసుక మాఫియాకు నేతృత్వం వహించిన వ్యక్తులు.. రైతుల రూపంలో రంగప్రవేశం చేస్తున్నారు. దీంతో ఇసుక విధానం ఉద్దేశం దెబ్బతినడంతో పాటు.. అసలైన రైతులు నష్టపోయే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement