'తల్లీ తనయుడు డుమ్మా కొట్టారు' | Sabita Indra Reddy her son karthik reddy skip telangana congress meeting | Sakshi
Sakshi News home page

'తల్లీ తనయుడు డుమ్మా కొట్టారు'

Aug 25 2014 9:09 AM | Updated on Aug 11 2018 7:11 PM

'తల్లీ తనయుడు డుమ్మా కొట్టారు' - Sakshi

'తల్లీ తనయుడు డుమ్మా కొట్టారు'

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భవిష్యత్ కార్యాచరణ సదస్సుకు జిల్లాకు చెందిన పలువురు సీనియర్లు గైర్హాజరు అయ్యారు.

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భవిష్యత్ కార్యాచరణ సదస్సుకు జిల్లాకు చెందిన పలువురు సీనియర్లు గైర్హాజరు అయ్యారు. మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డితో పాటు ఆమె వర్గంగా పేరొందిన పలువురు నాయకులు సదస్సుకు డుమ్మా కొట్టారు. పార్టీకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానంటూ ఇటీవలి  జరిగిన పలు సమావేశాల్లో సబితా ఉద్ఘాటించగా... తాజా సదస్సుకు దూరంగా ఉండటంపై అక్కడి నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

మరోవైపు ఇబ్రహీంపట్నంలో తలపెట్టిన సదస్సుకు పార్టీలో కీలకంగా వ్యవహరించే మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సైతం హాజరు కాలేదు. జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ నేతలంతా సదస్సుకు గైర్హాజరు అయినట్లు సమాచారం.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement