ఖాళీ ప్రదేశాలకు రైతుబజార్లు

Rythu Bazar Shifted To Open Grounds Due To Coronavirus In Telangana - Sakshi

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రీడా మైదానాలు, బస్టాండ్లు

కళాశాల ప్రాంగణాల్లో కూరగాయల అమ్మకాలు 

సామాజిక దూరం పెరిగేలా జాగ్రత్తలు 

గ్యాస్‌ బుకింగ్‌లపై 14 రోజుల ఆంక్షలు 

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం మరిన్ని ముమ్మర చర్యలు చేపట్టింది. చాలా చోట్ల ప్రజలు నిత్యావసరాలు, కూరగాయల కొనుగోళ్ల కోసం గుంపులుగుంపులుగా వస్తున్న దృష్ట్యా, దీన్ని నిరోధించడానికి రైతుబజార్‌లను విశాల ప్రదేశాలకు, ఖాళీ ప్రదేశాలకు తరలిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా, మండల కేంద్రాల్లో ఖాళీగా ఉన్న క్రీడా మైదానాలు, బస్టాండ్లు, కళాశాల, పాఠశాల ల ప్రాంగణాల్లో కూరగాయల విక్రయాలకు చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై ఇప్పటికే జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఇప్పటికే హైదరాబాద్‌ చింతలబస్తీల్లోని మార్కెట్‌ను పక్కనే ఉన్న రాంలీలా మైదానంలో తరలించారు.

సంగారెడ్డిలో సైతం కలెక్టరేట్‌ వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో కూరగాయల అమ్మకాలు చేపట్టగా, కరీంనగర్‌ బస్టాండును మార్కెట్‌గా మార్చేశారు.చాలా చోట్ల ఇదేమాదిరి రైతుబజార్లను తరలించి కొనుగోలుదారుల మధ్య సామాజిక దూరం ఉండేలా  మార్కింగ్‌ చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు హైదరాబాద్‌కే పరిమితమైన రైతుబజార్‌లను జిల్లాల్లో ఏర్పాటు చేసేలా చర్యలు మొదలు పెట్టారు. దీనిద్వారా ఎక్కడివారికి అక్కడే నిత్యావసరాలు అందుబాటులోకి తేవడంతోపాటూ  గుంపులను నివారించే చర్యలు తీసుకుంటున్నారు.  

గ్యాస్‌ బుకింగ్‌లపై ఆంక్షలు..
ఇక లాక్‌డౌన్‌ పేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్‌ బు కింగ్‌లకు డిమాండ్‌ పెరగడంతో ఆయిల్‌ కం పెనీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. విని యోగదారులు ఒకటికి మించి ఎక్కువ గ్యాస్‌ బుకింగ్‌లు చేయకుండా పలు ఆంక్షలు విధించాయి. ఒక బుకింగ్‌ జరిగాక, రెండో బుకింగ్‌కు కనీసం 14 రోజుల గ్యాప్‌ ఉండేలా ఆంక్ష లు తెచ్చాయి. ఈ మేరకు హెచ్‌పీ, భారత్‌గ్యాస్, ఇండేన్‌ గ్యాస్‌లు నిర్ణయం తీసుకున్నా యి. గతంలో కేవలం ఒక్క రోజు తేడాతో రెండో బుకింగ్‌కు సైతం సిలిండర్‌ సరఫరా చేసేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో డిమాండ్‌ పెరుగుతుండటం, వినియోగదారులు రెం డుమూడు సిలిండర్‌లను బుక్‌ చేసుకుంటున్న నేపథ్యంలో ఈ ఆంక్షలు ఫలితాలనిస్తా యని ఆయిల్‌ కంపెనీలు చెబుతున్నాయి. మరోపక్క కేంద్రం ఉజ్వల పథకం కింది లబ్ధిదారులకు వచ్చే మూడు నెలల పాటు ఉచితంగా గ్యాస్‌ అందిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనూ బుకింగ్‌లు పెరగడంతో కంపెనీలు జాగ్రత్తలు తీసుకున్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top