బడికి వస్తే నెలకు రూ.200 | Rs 200 per month to get to school | Sakshi
Sakshi News home page

బడికి వస్తే నెలకు రూ.200

Feb 4 2017 3:02 AM | Updated on Sep 5 2017 2:49 AM

బడికి వస్తే నెలకు రూ.200

బడికి వస్తే నెలకు రూ.200

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఇబ్రహీంపూర్‌ ప్రభుత్వ హైస్కూల్‌ కు వచ్చే పొరుగు గ్రామాల విద్యార్థులకు

విద్యార్థులకు ఎంపీటీసీ ప్రోత్సాహకం

రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఇబ్రహీంపూర్‌ ప్రభుత్వ హైస్కూల్‌ కు వచ్చే పొరుగు గ్రామాల విద్యార్థులకు ఒక్కొక్క రికి ప్రోత్సాహకంగా ప్రతి నెల రూ.200 ఇస్తానని ఎంపీటీసీ సభ్యుడు మాలోతు నర్సింహ ప్రకటిం చారు. ఇబ్రహీంపూర్‌లో శుక్రవారం జరిగిన గ్రామ సందర్శనలో హైస్కూల్‌లో విద్యార్థుల సంఖ్య 73 మాత్రమే ఉందని, పక్కనే ఉన్న ఫతేషాపూర్, మాదారం ప్రాథమిక పాఠశాలల్లో చదివిన తర్వాత కిలోమీటర్‌ దూరంలో ఉన్న ఇక్కడి జిల్లా పరిషత్‌ పాఠశాలకు విద్యార్థులు రావడం లేదని ఎంఈవో జయసాగర్‌ వద్ద గ్రామస్తులు వాపోయారు.

ఈ సందర్భంగా ఎంపీటీసీ నర్సింహ మాట్లాడుతూ హైస్కూల్‌లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నా ఫతేషాపూర్, మాదారం గ్రామాల విద్యా ర్థులు ఇతర గ్రామాలకు వెళ్లడం బాధాకరమన్నారు. నిడిగొండ, ఖిలాషాపూర్‌ పాఠశాలలకు వెళ్లే ఫతేషా పూర్, మాదారం విద్యార్థులు ఇబ్రహీంపూర్‌ పాఠశాలలో చేరితే నెలకు ఒక్కొక్కరికి రూ. 200 చొప్పున ప్రతి నెల ఇస్తానని ఎంపీడీవో బానోతు సరిత, స్పెషలాఫీసర్‌ నరేందర్‌రెడ్డి, ఎంపీపీ దాసరి అనిత సమక్షంలో ఆయన ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement