పాత కమిటీలకే మళ్లీ పట్టం!

Repeated the old committees in Agricultural Market Committee! - Sakshi

వ్యవసాయ మార్కెట్‌ కమిటీల కొత్త చట్టం అభాసుపాలు

చట్టం స్ఫూర్తికి సర్కారు గండి

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ మార్కెట్‌ కమిటీల కొత్త చట్టం ఏడాదికే అభాసు పాలైంది. పాత చట్టానికి చేసిన సవరణల అమలులో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తే సింది. మూడేళ్లపాటు ఉన్న కమిటీల పదవీకాలాన్ని తెలంగాణ నూతన మార్కెటింగ్‌ చట్టం ద్వారా ప్రభుత్వం ఏడాదికి కుదించింది. ఏడాది పూర్తయిన మార్కెట్‌ కమిటీ పాలక వర్గాలకు 6 నెలలపాటు పదవీ కాలాన్ని పొడిగిస్తూ జీవోలు జారీ చేస్తోంది. దీంతో కొత్త చట్టానికి ఏడాది లోనే తూట్లు పడ్డట్లయింది.

తొలుత ఏడాదికి కుదింపు: రాష్ట్రంలో మొత్తం 180 మార్కెట్‌ కమిటీలున్నాయి. కొత్త మార్కెట్‌ కమిటీల చట్టం అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం 2016 ఏప్రిల్‌ నుంచి పలు దఫాలుగా 160 మార్కెట్లకు పాలక వర్గాలను నియమించింది. తొలి సారిగా లాటరీ పద్ధతిన రిజర్వేషన్లు ఖరారు చేయటం, మహిళలకు 33 శాతం పదవులు రిజర్వు చేయటంతో మార్కెట్‌ కమిటీల నియామకాలు ప్రత్యేకతను చాటుకున్నాయి. మూడేళ్లున్న పాలకవర్గం పదవీకాలాన్ని కొత్త చట్టంలో ఏడాదికి కుదించటం, ఏడాదికోసారి రిజర్వేషన్‌ను రొటేషన్‌ చేసేలా చట్టం ఉండ టంతో అన్ని సామాజిక వర్గాలను ఆకట్టు కుంది. ఈ అంశాలనే ప్రభుత్వం విస్మరించటంతో అన్ని వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో గందరగోళం నెలకొంది. 

జూలైలోనే ముగిసిన పదవీకాలం
కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం నియమించిన 160 మార్కెట్‌ కమిటీల్లో దాదాపు వందకుపైగా కమిటీల పదవీ కాలం గత జూలైలో ముగిసిపో యింది. ఆ వెంటనే సంబంధిత మార్కెట్ల కు కొత్త పాలకవర్గాలను నియమించాలి. రొటేషన్‌ ప్రకారం రిజర్వేషన్లను మార్చి ఇతర సామాజిక వర్గాలకు కమిటీ పదవులు దక్కేలా అమలు చేయాలి. ప్రభుత్వం అదేమీ పట్టించుకోలేదు. పదవీకాలం ముగిసిన మార్కెట్‌ పాలక వర్గాలకు గడువు పొడిగించే పాత ఎత్తుగడను అను సరించింది.

వంద కమిటీలకు 6 నెలల పాటు గడువు పొడిగిస్తూ ఎప్పటికప్పుడు ఉత్తర్వులు జారీ చేస్తోంది. దీంతో పదవీ కాలం ముగిసిన మార్కెట్‌ కమిటీ చైర్మన్లు ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ముఖ్య నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమనే మళ్లీ కొనసాగిం చాలని, పదవీ కాలాన్ని పొడిగించాలని ఒత్తిళ్లు తెస్తున్నా రు. ఇప్పటికే పొడిగింపు వెసులుబాటు పొందిన కమిటీలు  మళ్లీ పొడిగింపునకు క్యూ కడుతున్నాయి. మరోవైపు రిజర్వేషన్ల రొటేషన్‌తో తమకూ అవకాశం వస్తుందని ఏడాదిగా ఎదురుచూసిన ఇతర సామాజిక వర్గాల నేతలు డీలా పడ్డారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top