దాడులకు పాల్పడ్డ ‘తోట’పై పీడీయాక్ట్‌

The Ramagundam Police Commissioner Who Put the PD Act on the Thota Venu - Sakshi

గతంలో ఎమ్మెల్యే పదవికి పోటీ చేసి ఓడిన వేణు

అరాచక శక్తులు ఎంతటివారైనా ఉపేక్షించం : సీపీ

గోదావరిఖని(రామగుండం): రాజకీయ నాయకుడి ముసుగులో గుండాయిజానికి పాల్పడుతున్న వ్యక్తిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. చ ట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న మాజీ కార్పొరేటర్‌ తనయుడు తోట వేణుపై పీడీయాక్టు అమలు చేసి, గోదావరిఖనిలో వేళ్లూనుకున్న గుండాయిజానికి చెక్‌పెడు తూ కఠిన చర్యలకు పూనుకున్నారు పోలీసులు. వి వరాల్లోకి వెళ్తే రామగుండం కమిషనరేట్‌ పరిధిలో గొడవలు సృష్టిస్తూ, బెదిరింపులకు పాల్పడుతూ, రాజకీయం ముసుగులో డబ్బులు వసూలు చే స్తున్న తోట వేణుపై పీడీ యాక్ట్‌ అమలు చేస్తూ రా మగుండం పోలీస్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ బుధవారం ఉత్వర్తులు జారీ చేశారు. స్థానిక శి వా జీనగర్‌కు చెందిన వేణుపై 12క్రిమినల్‌ కేసులు న మోదైనట్లు పేర్కొన్నారు. అతడు గతంలో ఎమ్మె ల్యే అభ్యర్థిగా  పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 

కుటుంబంపై దాడిచేసి జైలులో..

ఇటీవల శివాజీనగర్‌లో పూల వ్యాపారం చేసుకునే వారిని రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేయడం, టేలాను ధ్వంసం చేసి కుటుంబంపై దాడి చేసిన కేసులో వేణు ప్రస్తుతం జైలులో ఉన్నాడు. ఈ దాడి ఘటన పట్టణంలో తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో పలు దాడుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఓ పత్రికా కార్యాలయంపై దాడి చేసి విలేకరిపై హత్యాయత్నం చేశాడన్న అభియోగంపై కూడా అతడిపై కేసు నమోదైంది. వీటితో పాటు పోచమ్మ మైదానంలో వ్యాపారులను బెదిరించాడని, తదితర కేసులు కూడా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అతడి ప్రవర్తనపై రామగుండం సీపీ సీరియస్‌గా తీసుకున్నారు. ఇటీవల పలు డివిజన్లలో కొందరు మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులను గొడవలకు పురిగొల్పడంతో శాంతిభద్రతల సమస్యగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో వేణుపై పీడీయాక్ట్‌ నమోదు చేయడంతో అరాచక శక్తులకు పోలీసులు గట్టి హెచ్చరిక చేసినట్‌లైంది. ఈమేరకు గోదావరిఖని వన్‌టౌన్‌ సీఐ పర్శ రమేశ్‌ జైలులో ఉన్న తోట వేణుకు బుధవారం పీడీ యాక్టు ఉత్తర్వులు అందజేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top