అమ్మ సేవలో.. | PV Sindhu Visit Lal Darwaja Mahankali Temple Hyderabad | Sakshi
Sakshi News home page

లాల్‌దర్వాజా అమ్మవారికి సింధు పూజలు

Aug 13 2018 10:17 AM | Updated on Sep 4 2018 5:53 PM

PV Sindhu Visit Lal Darwaja Mahankali Temple Hyderabad - Sakshi

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు ఆదివారం లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.

చాంద్రాయణగుట్ట: లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు ఆదివారం బంగారు బోనం సమర్పించారు. గత వారం జరిగిన బోనాల పండుగకు ఆమె చైనాలో జరుగుతున్న పోటీల కారణంగా హాజరు కాలేకపోయారు. ఈ క్రమంలో ఆదివారం మారుబోనం ఉత్సవంలో ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు సింధు ఆలయానికి విచ్చేశారు. సంప్రదాయ వస్త్రాధారణతో వచ్చిన ఆమెకు మేళతాళాలతో స్వాగతం పలికారు. అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. లాల్‌దర్వాజా అమ్మవారు తన ఇష్టదైవంగా చెప్పారు. ఏటా బోనాల జాతరకు వస్తుంటానని, అమ్మ దీవెనతోనే తాను అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నట్టు చెప్పారు. త్వరలో జరిగే ఏషియన్‌ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి తిరిగి అమ్మవారిని దర్శించుకుంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ పి.వై.కైలాష్‌ వీర్, ప్రతినిధులు కె.వెంకటేష్, జి.మహేష్‌ గౌడ్, బి.బల్వంత్‌ యాదవ్, మాణిక్‌ ప్రభు గౌడ్, తిరుపతి నర్సింగరావు, విష్ణు గౌడ్, కాశీనాథ్‌ గౌడ్, రాజ్‌కుమార్‌ యాదవ్, అరవింద్‌ కుమార్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement