పసుపు రైతులను ఆదుకోవాలి 

The price of yellow is falling and farmers are struggling - Sakshi

పసుపు ధర పడిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారు

 పార్లమెంటు ఎన్నికల్లో పొత్తులపై అధిష్టానానిదే నిర్ణయం

కాంగ్రెస్‌ శాసనసభ పక్షనేత మల్లు భట్టివిక్రమార్క 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఎర్రజొన్న, పసుపు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టివిక్రమార్క కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోర్తాడ్‌లో జరిగిన సభలో ప్రతి పసుపు కొమ్మును, ఎర్రజొన్న విత్తును కొంటామని సీఎం కేసీఆర్‌ చెప్పారని, ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. గాంధీభవన్‌లో సోమవారం విలేకరులతో ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్‌. దాసోజు శ్రావణ్‌కుమార్, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ యాదవ్, కిసాన్‌ సెల్‌ చైర్మన్‌ అన్వేశ్‌రెడ్డి, కార్యవర్గ సభ్యుడు ఆదిరెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్‌లతో కలసి ఆయన మాట్లాడారు.

పసుపు పంటకు 2007–08 సంవత్సరంలోనే రూ.15వేల వరకు ధర ఉండేదని, ఇప్పుడది రూ.4–5వేలకు పడిపోవడంతో ప్రతి ఎకరాకు రైతు రూ.2లక్షల మేర నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్‌ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ కవిత పసుపు బోర్డు ఏర్పాటుపై అక్కడి రైతాం గానికి హామీ ఇచ్చినా సాధించలేకపోయారని విమర్శించారు. రైతులు ఇబ్బందులు పడకుం డా ప్రభుత్వమే తగిన ధర చెల్లించి కొనుగోలు చేయాలని, లేదంటే స్థిరీకరణ ధర ద్వారా మా ర్కెట్‌ శక్తులను నియంత్రించాలని కోరారు.

పోటీపడి దరఖాస్తులిస్తున్నారు 
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు ఆశావాహులు పోటీలుపడి దరఖాస్తులు చేస్తున్నారని, వచ్చిన దరఖాస్తులన్నింటినీ ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ పరిశీలించిన అనంతరం జాబితాను అధిష్టానానికి పంపు తామని భట్టివిక్రమా ర్క చెప్పారు. ఈనెలాఖరుకల్లా లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఓ కొలిక్కి వస్తుందని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో ఇతర రాజకీయ పార్టీలతో పొత్తుపై అధిష్టానందే తుది నిర్ణయమన్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top