హిజ్రాలకు రైల్వే పోలీసుల కౌన్సెలింగ్ | police councelling of third genders | Sakshi
Sakshi News home page

హిజ్రాలకు రైల్వే పోలీసుల కౌన్సెలింగ్

Apr 12 2015 2:17 PM | Updated on Aug 21 2018 5:46 PM

హిజ్రాలకు రైల్వే పోలీసుల కౌన్సెలింగ్ - Sakshi

హిజ్రాలకు రైల్వే పోలీసుల కౌన్సెలింగ్

చప్పట్లు కొట్టడం.. రూ.10 తక్కువ కాకుండా డబ్బులిస్తే సరేసరి.

వరంగల్: చప్పట్లు కొట్టడం.. రూ.10 తక్కువ కాకుండా డబ్బులిస్తే సరేసరి.. లేకుంటే ఇవ్వని వారి చొక్కా పట్టుకుని దాడికి దిగడం..
హిజ్రాల దౌర్జన్యకర చర్యలు సికింద్రాబాద్ - విజయవాడ మార్గంలో రైలు ప్రయాణికులకు అనుభవమే. ఈ నేపథ్యంలో వరంగల్ రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్) పోలీసులు ఆదివారం హిజ్రాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. సీఐ హరిబాబు ఆధ్వర్యంలో పోలీసులు వరంగల్ రైల్వే స్టేషన్లో సుమారు 50 మంది హిజ్రాలతో సమావేశం అయ్యారు. ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేయటం, వారిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించటం, చైన్ లాగి పారిపోవటం వంటి చర్యలు సరికాదని, వీటిని మానుకోవాలని సూచించారు. గౌరవంగా జీవించాలని, లేకుంటే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హిజ్రాలను హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement